JC Divakar : రాయ‌ల‌తెలంగాణ, జేసీ మ‌ళ్లీ తెర‌పైకి..

రాయ‌ల తెలంగాణ కావాల‌ని కొత్త డిమాండ్ తెర మీద‌కు వ‌స్తోంది. టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ జేసీ దివాక‌ర్ రెడ్డి (JC Divakar) చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 05:40 PM IST

రాయ‌ల తెలంగాణ కావాల‌ని కొత్త డిమాండ్ తెర మీద‌కు వ‌స్తోంది. ఆ డిమాండ్ ను టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ జేసీ దివాక‌ర్ రెడ్డి (JC Divakar) చేస్తున్నారు. విద్యుత్ , నీళ్ల స‌మ‌స్య లేకుండా ఉండాలంటే రాయ‌ల తెలంగాణ(Rayala Telangana) అనివార్య‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. అందుకోసం పోరాటానికి సిద్ద‌మంటూ ప్ర‌క‌టించారు. రాబోవు రోజుల్లో రాయ‌ల‌సీమ‌ను తెలంగాణ‌లో క‌లుపుకోవాల‌ని కేసీఆర్ ను కోర‌తానంటూ వెల్ల‌డించారు. రాష్ట్ర విభ‌జ‌న కోసం చేసిన ఉద్య‌మంలా మ‌రో ఉద్య‌మం రాయ‌ల తెలంగాణ కోసం అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

రాయ‌ల తెలంగాణ డిమాండ్ తెర మీద‌కు (JC Divakar)

ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న సంద‌ర్భంగా ప‌లు సంద‌ర్భాల్లో రాయ‌ల తెలంగాణ(Rayala Telangana) డిమాండ్ ను జేపీ దివాక‌ర్ రెడ్డి(JC Divakar) చేశారు. ఆయ‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న లీడ‌ర్. 40ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నారు. మంత్రిగా సుదీర్ఘ కాలం ప‌నిచేసిన అనుభ‌వ‌జ్ఞుడు. ఇప్పుడు ఆయ‌న రాయ‌ల తెలంగాణ కావాల‌ని కోరుకుంటున్నారు. లేదంటే, రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని బాధ‌ప‌డుతున్నారు.

ఇటీవ‌ల తెలంగాణ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు చేదుఅనుభ‌వం ఎదుర‌యింది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీలో రారాజుగా ఉండే రాజ‌కీయ‌వేత్త‌గా పేరున్న ఆయ‌న‌కు తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా అవ‌మానం జ‌రిగింది. సీఎం కేసీఆర్ ను కల‌వ‌డానికి ప్ర‌య‌త్నం చేసి అవ‌మాన ప‌డ్డారు. అక్క‌డ నుంచి తెలంగాణ నేత‌ల సూటిపోటి మాట‌ల‌తో వెనుతిరిగారు. ఆ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తాన‌ని సూచాయ‌గా అన్నారు. ఏదో ఆవేశంలో ఆయ‌న ఆ విధంగా వ్యాఖ్యానించి ఉంటార‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌న దూర ఆలోచ‌న‌తో అప్పుడు అలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది.

తెలుగు రాష్ట్రాల‌ను తిరిగి క‌ల‌పాల‌నే డిమాండ్

భార‌త రాష్ట్ర స‌మితిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం త‌రువాత తెలుగు రాష్ట్రాల‌ను తిరిగి క‌ల‌పాల‌నే డిమాండ్ అప్పుడ‌ప్పుడూ వినిపిస్తోంది. లేదంటే, కేంద్ర పాలిత ప్రాంతంగా హైద‌రాబాద్ ను చేయాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇటీవల జ‌రిగిన అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన అంబేద‌ర్క‌ర్ మ‌న‌వ‌డు కూడా హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఒకానొక సంద‌ర్భంగా కేసీఆర్ కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయ‌డానికి పాజిటివ్ గా ఉన్నారు. అయితే, ఢిల్లీ త‌ర‌హా రాజ‌ధాని చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. స‌రిగ్గా ఇక్క‌డే కేసీఆర్ అభ్యంత‌ర పెడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో జేసీ దివాక‌ర్ రెడ్డి(JC Diveakar) లాంటి వాళ్లు రాయ‌ల‌తెలంగాణ ప్ర‌స్తావ‌న తెస్తున్నారంటే ఏదో ఆలోచ‌న ఉండే ఉంటుంది.

Also Read : TDP : చంద్ర‌బాబు ఆయుధాలు కోడిక‌త్తి,వివేకా హ‌త్య

రాబోవు ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ ప‌రిధిలో ఏపీకి చెందిన లీడ‌ర్లు పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. పైగా తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం కావాల‌ని చూస్తోంది. ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఈనెల 26వ తేదీ నుంచి 28 వ‌ర‌కు తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేసింది. అంటే, బీఆర్ఎస్ పార్టీగా జాతీయ వాయిస్ వినిపిస్తోన్న కేసీఆర్ కు పోటీగా ఈసారి ఎన్నిక‌ల్లో ఆంధ్రా లీడ‌ర్లు రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. అందుకే, ఇప్ప‌టి నుంచే టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ జేసీ దివాక‌ర్ రెడ్డి(JC Divakar) రాయ‌ల తెలంగాణ (Rayala Telangana) అంటూ ఒక నినాదాన్ని అందుకున్నార‌ని తెలుస్తుంది.

Also Read : CBN : చంద్ర‌బాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటిక‌ల్ కుట్ర‌?