JC Brothers : తెలంగాణ ఎన్నిక‌ల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ ? అదే బాట‌న మ‌రికొంద‌రు ఏపీ లీడ‌ర్లు?

తెలంగాణ మీద ఏపీ లీడ‌ర్లు (JC Brothers) ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌రిధిలో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 01:28 PM IST

తెలంగాణ మీద ఈసారి ఏపీ లీడ‌ర్లు (JC Brothers) ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌త్యేకించి రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అలాంటి వాళ్ల‌లో జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రు. ఆయ‌న గతంలోనే తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా త‌న మ‌నోభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. దానికి కొన‌సాగింపుగా పూర్వీకులు తెలంగాణలోని గద్వాల ప్రాంతంలో ఉన్న జూటూరని తాజాగా జేపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వెల్ల‌డించారు. సుమారు 370 ఏళ్ల నాటి సంగతి అంటూ ఇటీవల ఒక ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పుకొచ‌య‌చారు. అంతేకాదు ఆ ఊరి పేరే తమ ఇంటి పేరని ఆధారం చూపించారు. చరిత్ర పుట‌ల్లోకి వెళ్లి చూస్తే త‌మ‌ది తెలంగాణగా తేలింద‌ని వెల్ల‌డించారు.

తెలంగాణ మీద ఈసారి ఏపీ లీడ‌ర్లు (JC Brothers)

రాబోవు రోజుల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాల‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి(JC Brothers) ఆలోచ‌న ఉంద‌ని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వినికిడి. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీలో కొన‌సాగుతోన్న జేసీ బ్ర‌ద‌ర్స్ రాజ‌కీయంగా ఎదురీదుతున్నారు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీకరించిన త‌రువాత ఆర్థిక మూలాలు దెబ్బతీశార‌ని ఆయ‌న వ‌ర్గీయుల భావ‌న‌. అయితే, తాడిప‌త్రిలో రాజ‌కీయ‌ప‌ట్టు పోకుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌స్తోన్న జేసీ బ్ర‌ద‌ర్స్ కు ఇటీవ‌ల తెలంగాణ మీద కన్నుప‌డింద‌ట‌. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలోనూ రాయ‌ల తెలంగాణ అంశాన్ని జేసీ దివాక‌ర్ రెడ్డి ప‌లుమార్లు తెర‌మీద‌కు తీసుకొచ్చారు.

జేసీ బ్ర‌ద‌ర్స్ కు ఇటీవ‌ల తెలంగాణ మీద కన్నుప‌డింద‌ట‌

రాజ‌కీయంగా సుదీర్ఘ ప్ర‌యాణం జేసీ దివాక‌ర్ రెడ్డిది. కాంగ్రెస్ పార్టీలో 40ఏళ్ల‌పైగా కొనసాగారు. ఆ పార్టీలోనే ఎమ్మెల్యే, మంత్రిగా ప‌నిచేశారు. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న సీఎం అభ్య‌ర్థిగా కూడా అప్ప‌ట్లో కాంగ్రెస్ లో వినిపించింది. ఆ స్థాయికి చేరిన దివాక‌ర్ రెడ్డి రాజ‌కీయం సీఎంగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత త‌గ్గుతూ వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంనాటికి పూర్తి స్థాయిలో రాజ‌కీయంగా వెనుక‌బ‌డ్డారు. అనంతపురం జిల్లాల్లో తిరుగులేని లీడ‌ర్లుగా అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలుగుదేశం పార్టీకి చేరిన త‌రువాత జేసీ బ్ర‌ద‌ర్స్ (JC Brothers)గ్రాఫ్ ప‌డిపోతూ వ‌చ్చింది.

కూక‌ట్ ప‌ల్లి, జూబ్లీహిల్స్ మీద దివాక‌ర్ రెడ్డి క‌న్నేశార‌ని

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని జేసీ దివాక‌ర్ రెడ్డి నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. ఆయ‌న కూడా ఇటీవ‌ల సూచాయ‌గా అదే విష‌యాన్ని చెప్పారు. ఇక ఆయ‌న బ్ర‌ద‌ర్ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాత్రం రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్నామ‌ని ఫోక‌స్ అవుతున్నారు. వార‌సుల‌ను రాజ‌కీయాల్లో యాక్టివ్ చేయాల‌ని ఇద్ద‌రూ వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత దివాక‌ర్ రెడ్డి వాయిస్ త‌గ్గింది. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. ఆ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ను క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అపాయిట్మెంట్ దొర‌క‌లేదు. దీంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ఆనాడు త‌న మ‌నోభావాన్ని మీడియా వ‌ద్ద (JC Brothers) ప‌రోక్షంగా వ్య‌క్త‌ప‌రిచారు.

Also Read : Priya Fix TDP : మాజీ మంత్రుల గుట్టుర‌ట్టు 

ఏపీ ఎన్నికల్లో వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల్లో దివాక‌ర్ రెడ్డి అడుగుపెట్ట‌డానికి గ్రౌండ్ వ‌ర్క్ త‌యారు చేస్తున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి అనువుగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేసుకున్న‌ట్టు వినికిడి. గెలిచే అవ‌కాశం ఉన్న కూక‌ట్ ప‌ల్లి, జూబ్లీహిల్స్ మీద దివాక‌ర్ రెడ్డి క‌న్నేశార‌ని తెలుస్తోంది. ఒక వేళ బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయాల‌ని కూడా దివాక‌ర్ రెడ్డి అనుచ‌రుల నుంచి అందుతోన్న స‌మాచారం. అయితే, కేసీఆర్ అపాయిట్మెంట్ ల‌భించ‌క‌పోవ‌డంతో మ‌న‌స్తాపానికి దివాక‌ర్ రెడ్డి గుర‌య్యార‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌.

Also Read : BRS Kokapet : 2నెల‌ల్లో KCR సంపాదన 1500 కోట్లు!

మొత్తం మీద తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని దివాక‌ర్ రెడ్డి పావులు క‌దుపుతుంటే, త‌మ్ముడు స్థానిక‌త‌ను బ‌య‌ట‌కు తీశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల్ వార‌సులుగా చెప్పుకుంటున్నారు. ఇలా, ఏపీలోని ప‌లువురు పూర్వీకుల స్థానిక‌త‌ను తీస్తే చాలా మంది తెలంగాణ‌కు చెందిన వాళ్లు ఉంటార‌ని ఏపీ రాజ‌కీయ నాయ‌కులు అంటున్నారు. తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని వాళ్లు దాదాపుగా రెండు రాష్ట్రాల‌కు చెందిన మూలాలు ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఉంటాయి. పైగా ఈసారి తెలంగాణ వాదం ఎన్నిక‌ల్లో వినిపించే ప‌రిస్థితి లేదు. ఆ వాదాన్ని కేసీఆర్ ఎత్తేశారు. ప్ర‌స్తుతం భార‌త రాష్ట్ర స‌మితిగా టీఆర్ఎస్ మారింది. జాతీయ రాజ‌కీయాల‌కు జాతీయ‌వాదం అందుకున్న కేసీఆర్ ఇక తెలంగాణ వాదాన్ని ముగిసిన అధ్యాయంగా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ లీడ‌ర్లు తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డానికి కొంద‌రు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ల‌లో జేసీ బ్ర‌ద‌ర్స్ ముందున్నారు.