Site icon HashtagU Telugu

Jayaho Andhra Matha : సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. ‘‘జయహో ఆంధ్రమాత’’ పాట వైరల్

Jayaho Andhra Matha

Jayaho Andhra Matha

Jayaho Andhra Matha : ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన వేళ.. మరోవైపు “జయహో ఆంధ్రమాత – సాహో నీదుచరిత” సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ గత వైభవాన్ని స్మరించుకుంటూ.. ఏపీ ఉజ్వలమైన భవిష్యత్‌ను ఆకాంక్షిస్తూ ఈ పాటను చక్కగా రచించారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ పాటకు(Jayaho Andhra Matha)  సినీ గేయరచిత త్రిపురనేని కల్యాణ చక్రవర్తి సాహిత్యం అందించారు. దీన్ని ఏపీ రాష్ట్రానికి అంకితం ఇస్తున్నానని రచయిత కళ్యాణచక్రవర్తి వెల్లడించారు. ఈ సాంగ్‌కు సంగీత దర్శకుడు హరిగౌర మ్యూజిక్‌ను అందించారు. సినీ నిర్మాత భరత్ చౌదరి ఈ పాట నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని ఇప్పుడు యూట్యూబ్‌లో ఎంతోమంది చూస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. లైక్స్ కూడా బాగానే వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Robbin Sharma : రాబిన్ శర్మ.. ఏపీలో టీడీపీ విజయం వెనుక మాస్టర్‌మైండ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా జూన్ 12 ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు.

Also Read :PM Modi: అభిమానులను రిక్వెస్ట్ చేసిన ప్రధాని మోదీ.. ఏంటంటే..?