మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మాటల తూటాలు వదిలారు. ముఖ్యంగా పవన్ ప్రసంగం రాత్రి నుండి సోషల్ మీడియా లో టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి. జగన్ ఫై విమర్శలే కాదు తనను టార్గెట్ చేస్తూ , పొత్తులపై చివాట్లు , 24 స్థానాలపై ఎద్దేవా చేసేవారికి సైతం ఇంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. ఈ సభ సక్సెస్ తో ఇరు పార్టీల్లో జోష్ పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సభ తర్వాత వైసీపీ నేతలకు నిద్ర కరవైందని టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ అన్నారు. భవిష్యత్ లో మీకు ఎవరూ నమస్కారం పెట్టే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది అని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఐదేళ్ల తన దోపిడీ పాలనలో జగన్ పేదల బలహీనతను కూడా సొమ్ము చేసుకున్నాడని ధ్వజమెత్తారు. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పేదలకు ఉచితంగా ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదనేది అక్షర సత్యమని అన్నారు. గతంలో చంద్రబాబు నిర్మించిన ఇళ్లను కూడా పాడుపెట్టాడని, చివరకు ఇళ్ల నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలుచేశాడని మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10 వేలకు అమ్మాడని, సిమెంట్, ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి… చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు తప్ప, జగన్ సర్కార్ ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
Read Also : Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్