AP CS : ఏపీ సీఎస్ గా జ‌వ‌హ‌ర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు.

  • Written By:
  • Updated On - November 29, 2022 / 05:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆ మేర‌కు మంగళవారం అధికారికంగా ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ‌న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఏపీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ హ‌యాంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా కూడా చేశారు. పలు కీలక శాఖల్లోనూ ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది.

ప్రస్తుత‌ సీఎస్ సమీర్ శర్మ పదవీ విరమణ చేయ‌నున్నారు. ఆయ‌న స్థానంలో సీఎస్ గా జవహర్ రెడ్డికి అవ‌కాశం ల‌భించింది. సమీర్ శర్మ పదవీ విరమణ చేసిన వెంట‌నే జవహర్ రెడ్డి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి ముందురోజే పలువురు ఐఏఎస్ అధికారులను ప్ర‌భుత్వం బదిలీ చేసింది. ప్ర‌భుత్వ చీఫ్ సెక్ర‌ట‌రీ అశకాశం కోసం చూసిన‌ పూనం మాలకొండయ్యను సీఎంవో స్పెషల్ గా సీఎస్ గా నియ‌మించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి, ఆ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్న బ‌దిలీ అయ్యారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న బుడితి రాజశేఖర్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.