Site icon HashtagU Telugu

Jaradoddi Sudhakar : లైంగిక వేధింపుల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్‌

Sudhakar Arrest

Sudhakar Arrest

కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ నేతలకు సంబదించిన రాసలీలలు అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కొంతమంది ఫోన్లలో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి రాగా..మరికొంతమంది వీడియోలు బయటకు వచ్చాయి. వీటిపై అప్పటి ప్రతిపక్ష పార్టీల నేతలు, రాష్ట్ర మహిళలు , నెటిజన్లు విరుచుకపడినప్పటికీ వీరు తీరు మాత్రం మార్చుకోలేదు. అధికారం మా చేతిలో ఉంది కదా అని కేసులు కాకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడం తో ఇప్పుడు వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జే.సుధాకర్ బాబు (Kodumuru MLA Dr. J Sudhakar Babu) కు సంబదించిన ఓ రాసలీలల వీడియో ఎన్నికల ముందు బయటకు వచ్చి నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో లో ఆయన ఓ యువతితో రాసలీలలు జరుపుతూ కనిపించారు. యువతిని బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ గా మారినప్పటికీ పోలీసులు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ ఆ పని చేసిన సుధాకర్ ను అరెస్ట్ చేసింది. ముందుగా సుధాకర్‌కు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు.

Read Also : CJI – Stock Markets : బీ అలర్ట్.. రాకెట్ స్పీడుతో స్టాక్ మార్కెట్లు : సెబీకి సీజేఐ సూచన