Japan : జపాన్ ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల ధాటికి తీవ్ర ఉత్కంఠకు గురవుతోంది. తాజాగా మౌంట్ షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బుధవారం మధ్యాహ్నం బద్దలై, దట్టమైన పొగ , బూడిద రేణువులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా స్థానికులను దూరంగా ఉండాలని హెచ్చరించారు. శుక్రవారం నాడు సమీప దీవుల నివాసితులను ఖాళీ చేయించారు.
ఇప్పటికే టోకారా దీవుల్లో జులై 5న 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సౌత్వ్ వెస్టర్న్ జపాన్ వణికిపోయింది. ఈ భూకంపం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉత్సాహాన్ని పెంచినదే కాదు, ఆందోళనలను మరింత ఎక్కువ చేసింది. జూన్ 21 నుండి ఇప్పటివరకు కగోషిమా ప్రిఫెక్చర్‌లో 1,000 కి పైగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ పరిణామాలతో జపాన్ ప్రజల మధ్య మరోసారి మాంగా కళాకారిణి రియో టాట్సుకి రాసిన “ది ఫ్యూచర్ ఐ సా” అనే పుస్తకం చర్చనీయాంశమైంది. ఈ గ్రంథంలో ఆమె జూలై నెలలో జపాన్‌లో భారీ ప్రకృతి విపత్తులు సంభవించనున్నాయని పేర్కొంది. అగ్నిపర్వతాలు, భూకంపాలు, వరదలు దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తాయని హెచ్చరించింది. ఇప్పుడు అవే అంచనాలు నిజమవుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది.
సోషల్ మీడియా వేదికగా ప్రజలు రియో తార్కికతపై చర్చించుకుంటూ.. ఆమెను బాబా వంగా వంటి భవిష్యద్వక్తులతో పోల్చుతున్నారు. అయితే ఇలాంటి అపోహలకు తావులేదని, ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
అయితే ఇది తొలిసారి కాదు – 2011లో బాబా వంగా చెప్పిన జోస్యం ప్రకారం జపాన్‌లో భారీ సునామీ సంభవించి, 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి గుర్తించాల్సిన అవసరం ఉంది. తాజా పరిణామాలతో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.