Site icon HashtagU Telugu

AP Janmat Poll Survey : ఏపీలో మళ్లీ జగనే రాబోతున్నాడు..

Janmat Poll Survey

Janmat Poll Survey

ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికీ పట్టం కట్టాలని చూస్తున్నారు..? ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు..? వైసీపీ (YCP) సంక్షేమ పథకాలు మరోసారి జగన్ ను గెలిపిస్తాయా..? లేదా టీడీపీ (TDP) కి ప్రజలు జై కొడతారా..? అసలు ఓటర్ల నాడీ ఎలా ఉంది..? అనేది తెలుసుకునేందుకు అనేక సంస్థలు రాష్ట్రంలో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాన్ని సేకరించే పనిలో పడ్డాయి. తాజాగా రాష్ట్రంలో సర్వే చేసిన జన్ మత్ మరోసారి ప్రజలు జగన్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పింది. ఇదే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన సర్వే (Janmat Polls survey) అంచనాలు వాస్తవ ఫలితాలతో నిజమయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో, ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే (AP Janmat Polls Survey)..ఫలితాల పైన ఆసక్తి పెరిగింది. ఈ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 116-118 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. టీడీపీ, జనసేన కూటమి 46-48 సీట్లు గెలుస్తాయని తేల్చింది. దీని ద్వారా ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం అని స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సర్వే కాంగ్రెస్ కు 61-63 స్థానాలు వస్తాయని అంచనా వేయగా..ఫలితాల్లో అదే సీట్లు కాంగ్రెస్ సాధించింది. ఇక..ఈ సర్వే జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో బీజేపీ ఒంటరిగా 309-3012, కాంగ్రెస్ 53-55 స్థానాలు గెలుస్తుందని అంచనాగా పేర్కొంది. ఇలా ఈ సర్వే చెప్పిన అన్ని చోట్ల అదే జరగడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు