Site icon HashtagU Telugu

Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!

Jani Master And 30 Years In

Jani Master And 30 Years In

ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడం తో చేరుతున్నారు.

ఇదిలా ఉంటె ఈసారి జనసేన ఊపు కూడా గట్టిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎన్నికల్లో కీ రోల్ పోషించబోతున్నట్లు అర్ధమవుతుంది. అందుకే ఈసారి ఇతర పార్టీల నేతలతో పాటు సినీ ప్రముఖులు (Cine Celebrities) కూడా పెద్ద ఎత్తున జనసేన లో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోగా..ఈరోజు సినీ ప్రముఖులు 30 ఇయర్స్ పృద్వి తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన లో చేరారు.

మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి జానీ మాస్టర్ను పవన్ (Pawan Kalyan) సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాస్టర్.. తెలుగుతో పాటు పలు తమిళ, కన్నడ, సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. మొదటి నుండి పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే జానీ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట రాజకీయాల్లో నడిచేందుకు డిసైడ్ అయ్యారు. మరి జానీ మాస్టర్ కు జనసేన టికెట్ ఏమైనా ఇస్తారో లేదో చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పృథ్వీరాజ్ సైతం ఈరోజు జనసేనలో చేరారు. ఆయన వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కొద్దికాలంగా పృథ్వీరాజ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. అదే సమయంలో జనసేనకు మద్దతు పలుకుతు వస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై పోటీకి తాను సిద్ధమని ఆ మధ్య ప్రకటించారు. మరి ఆ టికెట్ ఏమైనా పృథ్వీరాజ్ కు ఇస్తారో చూడాలి.

ఇదిలా ఉంటె తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. గూడూరు వైసీపీ టికెట్ మేరీగ మురళికి అధిష్ఠానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వరప్రసాద్.. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు మాజీ మంత్రి శ్రీ కొణతాల రామకృష్ణ సైతం పవన్ తో భేటీ అయ్యారు. మొత్తం మీద ఈసారి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతల చేరికలు జనసేన లో ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also : Revolt RV400 BRZ : మార్కెట్లోకి విడుదల అయిన మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?