Site icon HashtagU Telugu

Janasena youth :`ర‌ణ‌స్థ‌లం` కూల్ కూల్‌, వైసీపీ వ్యూహం ఫ‌ల‌ప్ర‌దం!

Janasena

Janasena Imresizer

శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం వ‌ద్ద జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్టిన `యువ‌శ‌క్తి` (Janasena youth) పై జీవో నెంబ‌ర్ 1 ప్ర‌భావం ఏమీలేదు. ఆ జీవో ప్ర‌కారం రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల(public meeting) విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆ జీవోలోని నిబంధ‌న‌ల గురించి రెండు రోజుల క్రితం లా అండ్ ఆర్డ‌ర్ డీజీ మీడియా వేదిక‌గా వివ‌రించారు. వాటి ప్ర‌కారం యువ‌శ‌క్తిని జ‌రుపుకోవ‌డానికి పోలీసుల నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఆ మేర‌కు జ‌న‌సేన ఏర్పాట్ల‌ను చేసుకుంది.

`యువ‌శ‌క్తి` పై జీవో నెంబ‌ర్ 1 (Janasena youth)

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు స‌భ‌ల‌కు అనూహ్య స్పంద‌న ఇటీవ‌ల వ‌చ్చింది. పైగా నిఘా వ‌ర్గాల స‌మాచారం కూడా టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింద‌ని చెప్పింద‌ట‌. అందుకే, చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డానికి ప‌లు ప్ర‌య‌త్నాల‌ను వైసీపీ చేసింది. జోరుగా సాగుతోన్న చంద్ర‌బాబు రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు జీవో నెంబ‌ర్ 1 తాత్కాలికంగా బ్రేక్ ప‌డేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ చేయ‌గ‌లిగింది. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో మాత్ర‌మే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డంలేదు. దానికి కార‌ణంగా జ‌న‌సేన గ్రాఫ్ పెరిగే అవ‌కాశంలేద‌ని నిఘా వ‌ర్గాల స‌మాచార‌మ‌ట‌.

Also Read : Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!

రెండేళ్ల వ్య‌వ‌ధిలో అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్ కొన్ని కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం కొన్ని ఆంక్ష‌లు పెట్టింది. ఫ‌లితంగా ప‌వ‌న్ స‌భ‌ల‌కు మీడియా వేదిక‌గా అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈసారి అలాంటి హైప్ ఇవ్వ‌డానికి అవ‌కాశం లేకుండా ప్ర‌భుత్వం జాగ్ర‌త్త ప‌డింది. పైగా ఇటీవ‌ల ప‌వ‌న్ ప‌లు వేదిక‌ల‌పై వాటిన ప‌రుష ప‌ద‌జాలం ఆయ‌న గ్రాఫ్ ప‌డిపోయేలా చేసింద‌ని నిఘా వ‌ర్గాల నివేదిక‌లోని సారాంశం. అందుకే, స్వేచ్ఛ‌గా ప‌వ‌న్ ను వ‌దిలేస్తే బెట‌ర్ అనే అభిప్రాయానికి వైసీపీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే గురువారం జ‌రిగే యువ‌శ‌క్తి (Janasena youth) గురించి వైసీపీ లైట్ గా తీసుకుందట‌.

Also Read : TDP-Janasena : టీడీపీ,జ‌న‌సేన సీట్లు ఎవ‌రికెన్ని.? బాబు, ప‌వ‌న్ లెక్క ఇదేనా?

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించే ‘యువశక్తి’ సభకు లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్‌తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. యువ‌శ‌క్తి స‌భ‌లో పాల్గొన‌డానికి బుధ‌వారం రాత్రి 11 గంటలకు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు యువశక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 100 మంది యువకులు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రెండు రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన జాతి భవిష్యత్తు మీదే.. జై హింద్!’ అంటూ పవన్‌ ట్వీట్ చేశారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసి ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ప‌వ‌న్ ను ఎక్క‌డ ఉంచాలో  రోడ్ మ్యాప్

ఎప్ప‌టి మాదిరిగా హ‌డావుడి చేయ‌డానికి జ‌న‌సైన్యం సిద్ధమ‌య్యారు. కానీ, వైసీపీ మాత్రం లైట్ గా తీసుకోవ‌డంతో యువ‌శ‌క్తి ప్రోగ్రామ్ మీడియాలోనూ హైలెట్ కాలేదు. జ‌న‌సేన సానుభూతి మీడియా మాత్రం ఆ స‌భ‌ను ప‌లు కోణాల నుంచి ఫోక‌స్ చేస్తోంది. రాబోవు రోజుల్లో ఏపీ సీఎం ప‌వ‌న్ గా ఫోక‌స్ చేస్తోంది. ఇలాంటి ప్ర‌చార‌మే వైసీపీ రాజ‌కీయంగా కావ‌ల్సింది కూడా. వ్యూహ‌త్మ‌కంగా టీడీపీని కార్న‌ర్ చేస్తూ జ‌న‌సేన పార్టీని రెచ్చ‌గొట్టేలా వైసీపీ గేమాడుతోంది. ఇంకో వైపు బీజేపీ ద్వారా ప‌వ‌న్ ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచేలా రోడ్ మ్యాప్ అమ‌లు చేస్తోంది. అందులో భాగంగా జీవో నెంబ‌ర్ 1 ప్ర‌భావం యువ‌శ‌క్తి(public meeting) మీద లేకుండా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

Also Read : Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!