Site icon HashtagU Telugu

Janasena : జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవేనా..?

Janasena Ts

Janasena Ts

ఏపీ (AP)లో ఎన్నికలు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతి పక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే వైసీపీ వరుస పెట్టి అభ్యర్థులను ప్రకటిస్తుండగా..టీడీపీ – జనసేన కూటమి సైతం త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జనసేన (Janasena) కు 35 సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలిమర్ల, అనకాపల్లి పరిధిలో పెందుర్తి, యలమంచిలి, కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రి పరిధిలో రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం పరిధిలో రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు పరిధిలో ఉంగుటూరు, కైకలూరు, విజయవాడ పరిధిలో విజయవాడ వెస్ట్, మచిలీపట్నం లోక్ సభ పరిధిలో ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

అలానే గుంటూరు పరిధిలో తెనాలి, గుంటూరు వెస్ట్, బాపట్ల పరిధిలో చీరాల, ఒంగోలు లోక్ సభ పరిధిలో దర్శి, గిద్దలూరు, నెల్లూరు పరిధిలో కోవూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి, రాజంపేట పరిధిలో రాజంపేట, మదనపల్లి, నంద్యాల పరిధిలో ఆళ్లగడ్డ, అనంతపురం పరిధిలో గుంతకల్లు, అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు. అలానే మూడు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేయనున్నారని తెలుస్తొంది.

Read Also : 10 Policemen Killed : పోలీస్ స్టేషన్‌పై టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి