Janasena vs YCP : ఆర్జీవీ, రోజా, అంబ‌టిల‌కు వార్నింగ్ ఇచ్చిన జ‌న‌సేన వీర‌మ‌హిళ‌లు

ఏపీలో ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతున్న వేళ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో

Published By: HashtagU Telugu Desk
Janasena

Janasena

ఏపీలో ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతున్న వేళ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సీనిమా తీసిని ఆర్టీవీ ఈ ఎన్నిక‌ల‌కు వ్యూహం పేరుతో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. వైసీపీ ఇలాంటి స్ట్రాట‌జీని ప్ర‌తి ఎన్నిక‌ల్లో ఫాలో అవుతుంది. అయితే ఇటీవ‌ల వ్యూహం ఫ్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ని విజ‌య‌వాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, లోకేష్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రులు రోజా, అంబ‌టి, డైరెక్ట‌ర్ ఆర్జీవీ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై జ‌న‌సైనికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ 33వ వార్డు కార్పొరేటర్‌ బిశెట్టి వసంతలక్ష్మి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త పంత్రి శివప్రసాద్‌ రెడ్డి, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి పంచకర్ల సందీప్‌ తదితరులు రాంగోపాల్‌ వర్మ, మంత్రులు రోజా, అంబటి రాంబాబుల ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. వైజాగ్‌లోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జ‌న‌సేన‌ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు జనసేన పార్టీని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుకు అప్పగించారని పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పవన్ అభిమానులు, కాపు కులస్తులు కోరుకుంటున్నారని, అయితే పవన్ పంక్చర్ అయిన సైకిల్ సొంతం చేసుకున్నాడనేది వాస్తవం అని రోజా అన్నారు.ఈ వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమ‌న్న జ‌న‌సైనికులు మంత్రులు అంబ‌టి, రోజాల‌కు వార్నింగ్ ఇచ్చారు. తమ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నార‌ని.. ఓట‌మి భ‌యంతోనే మంత్రులు ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని జ‌న‌సేన వీర మహిళ‌లు తెలిపారు.

Also Read:  Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పంద‌న .. తూర్పుగోదావ‌రిలో 1.75 లక్షలు మంది ద‌ర‌ఖాస్తు

  Last Updated: 26 Dec 2023, 08:29 AM IST