Janasena : ప‌వన్ పై `వారాహి`! రంగుపై జ‌గ‌న‌న్న `సైన్యం`!!

జ‌న‌సేనాని (Janasena) ప‌వ‌న్ ప్ర‌త్యేక వాహ‌నాన్ని త‌యారు చేయించారు. దానికి `వారాహి`(Varaahi)గా నామ‌క‌ర‌ణం చేశారు.

  • Written By:
  • Updated On - December 9, 2022 / 03:13 PM IST

సినిమా ప్ర‌మోష‌న్ త‌ర‌హాలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని(Publicity) ర‌క్తిక‌ట్టించ‌డానికి తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీలు `రోడ్ మ్యాప్` కు రూప‌క‌ల్ప‌న చేసుకున్నాయి. ప‌బ్లిసిటీ (Publicity) స్టంట్ మీద గెలుపు ఓట‌ములు ఆధార‌ప‌డ్డాయ‌ని న‌మ్మే రోజులివి. అందుకే, జ‌న‌సేనాని (Janasena) ప‌వ‌న్ ప్ర‌త్యేక వాహ‌నాన్ని త‌యారు చేయించారు. దానికి `వారాహి`(Varaahi)గా నామ‌క‌ర‌ణం చేశారు. ప్ర‌త్యంగిరి త‌ర‌హా పూజ‌లు చేయ‌డం నుంచి ఆ వాహ‌నాన్ని ఒక శ‌క్తిదేవ‌త‌గా చూపించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. స‌రిగ్గా ఇక్క‌డే జ‌న‌సేనాని (Janasena)కి ప్ర‌తిబంధ‌కం ఏర్ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. హిందువులు పూజించే అత్యంత శ‌క్తివంత‌మైన అమ్మ‌వారు `వారాహి`(Varaahi) దేవ‌త‌. ఆమె పేరును ఒక వాహ‌నానికి పెట్ట‌డాన్ని హిందూ సాధువులు వ్య‌తిరేకిస్తున్నారు. ఆ వాహ‌నాన్ని అమ్మ‌వారుగా ఫోక‌స్ చేస్తూ దానిపై ఎలా ప్ర‌యాణం చేస్తార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, ఆయ‌న‌కు అరిష్ట‌మని కొంద‌రు హిందూ ఆధ్మాత్మిక‌వేత్తలు హెచ్చ‌రిస్తున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థానికి `వారాహి` అమ్మ‌వారి పేరు పెట్ట‌డంతో పాటు దానికి మిలిట‌రీ రంగును వేయ‌డంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. భార‌త సైన్యం ఉపయోగించే వాహ‌నం మాదిరిగా దాన్ని డిజైన్ చేయ‌డంతో పాటు రంగును కూడా భార‌త మిల‌ట‌రీ వాహ‌నాలు వాడే దాన్ని వేయించారు. దీంతో వాహ‌నం డిజైన్, రంగు మీద భార‌త సైన్యం మాజీ అధికారులు అభ్యంత‌ర పెడుతున్నారు. దానిపై కొంద‌రు న్యాయ‌పోరాటానికి సిద్ధం అవుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి వివాద‌స్ప‌ద అంశాల‌తో ప‌వ‌న్ ను రాజ‌కీయ నేత‌గా హైలెట్ చేయ‌డానికి వ్యూహ‌క‌ర్తలు ర‌చిస్తోన్న రోడ్ మ్యాప్‌. అధికారికంగా జ‌న‌సేన పార్టీకి ఎలాంటి వ్యూహ‌క‌ర్త‌లు లేక‌పోయిన‌ప్ప‌టికీ సినిమా డైరెక్ట‌ర్లు కొంద‌రు ప‌వ‌న్ కు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తుంటారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌డానికి ప‌బ్లిసిటీ స్టంట్ల‌ను వేస్తుంటారు. అదే త‌ర‌హా స్టంట్ ల‌ను జ‌నసేన కోసం కొంద‌రు ప‌వ‌న్ వీరాభిమాన డైరెక్ట‌ర్లు ఇస్తోన్న స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జా క్షేత్రంలో ప్ర‌చారాన్ని బాగా తీసుకొస్తున్నాయి.

ప్ర‌చారానికి సిద్ధం చేసిన `వారాహి` వాహ‌నం మీద రాజ‌కీయ పార్టీలు సైతం అభ్యంత‌ర పెడుతున్నాయి. ఆ వాహ‌నం డిజైన్, రంగు, పేరు మీద ప‌లువురు సామాజికవేత్త‌లు, హిందూవాదులు కూడా విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. అందుకు జ‌నసేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకుని కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి ఉంద‌ని ఆ పార్టీ నేత‌ల‌కు రివ‌ర్స్ అటాక్ ఇచ్చారు.వారాహి వాహనం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కొట్టిపారేశారు. చట్టానికి వ్యతిరేకంగా జనసేన ఎప్పుడూ పని చేయదని వివ‌రించారు. ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందని అన్నారు.

మొత్తం మీద ప‌బ్లిసిటీతో ఈసారి ఎన్నిక‌ల్లో నెగ్గాల‌ని జ‌న‌సేన కొత్త పంథాను ఎంచుకుంది. ఇంచుమించుగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌ర‌హా ప్ర‌చారాన్ని డిజైన్ చేశారు. అయితే, ఎన్టీఆర్ ఆనాడు వాడిన వాహ‌నం రంగు, పేరు, డిజైన్ మీద ఎక్క‌డా అభ్యంత‌రం రాలేదు. ఎందుకంటే, ఆ వాహ‌నం పేరును చైత‌న్య ర‌థంగా పెట్టారు. ముదురు ఆకుప‌చ్చ రంగును చైత‌న్య‌ర‌థంకు ఉండేది. డిజైన్ కూడా సాధాసీదా ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం త‌యారు చేసిన వాహ‌నం డిజైన్ భార‌త మిల‌ట‌రీ వాహ‌నాల‌ను పోలి ఉంది. రంగు ప‌క్కాగా మిల‌టరీ వాహ‌నాల‌కు వాడేది వేయించారు. హిందువులు ప్ర‌తి క్ష‌ణం త‌ర‌చుకుని పూజించే `వారాహి` పేరు ఆ వాహ‌నానికి పెట్ట‌డం శ‌క్తివంత‌మైన దేవ‌తను స్మ‌రించే వాళ్లు అవ‌మానంగా ఫీల్ అవుతున్నారు. వారాహి దేవ‌త‌ను కొలిచే భ‌క్తుల‌కు ఇప్పుడు జ‌వ‌న్ వాహ‌నం గుర్తుకొస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అంతేకాదు, రాబోవు త‌రాల‌కు హిందూ దేవ‌త వారాహికి బ‌దులుగా ప‌వ‌న్ వాహ‌నం స్పుర‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిణామం ప‌వ‌న్ క‌ల్యాణ్ జీవితానికి, రాజ‌కీయ భ‌విష్య‌త్ కు అరిష్ట‌మ‌ని హిందూ పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఇంకా రోడ్డు ఎక్క‌డ‌కుండానే `వారాహి ` వాహ‌నం `రోడ్ మ్యాప్` వివాదంలోకి వెళ్లింది.

ఒక‌ప్పుడు విద్యార్థి ద‌శ నుంచి ప్ర‌జా సేవ అల‌వ‌డేది. కాలేజి ఎన్నిక‌ల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వాళ్లు. ఎన్నో పోరాటాలు, ఉద్య‌మాలు చేసి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టే లీడ‌ర్లు అనేక మందిని చూశాం. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌ను పెట్టుకుని ప్ర‌జ‌ల మాన‌సిక వీక్ నెస్ తెలుసుకుంటున్నారు. వాటి మీద రాజ‌కీయాల‌ను ఫ్రేమ్ చేస్తున్నారు. ఫ‌లితంగా కులం, మ‌తం, ప్రాంతం రాజ‌కీయాల్లో కీల‌క భూమిక‌ను పోషిస్తున్నాయి. దానికి తోడుగా సినిమా గ్లామ‌ర్ ఉంటే చాలు ఏ మాత్రం ప్ర‌జా సేవ చేయ‌కుండా రాజ్యాధికారాన్ని అందుకోవ‌చ్చ‌ని భావ‌న పెరిగింది. సినిమా క‌థ బాగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌బ్లిసిటీతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టే సంస్కృతి ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసింది. కులం, మ‌తం, ప్రాంతం త‌దిత‌ర భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం ద్వారా ఓట్ల‌ను కొల్ల‌గొట్ట‌డానికి ఎవ‌రికి వాళ్లే ప‌బ్లిసిటీ స్టంట్ కు రూప‌క‌ల్ప‌న చేసుకుంటున్నారు. ఆ కోవ‌లో ప‌వ‌న్ ఒక‌డుగు ముందుకేసి `వారాహి`దేవ‌త‌ను కూడా వ‌ద‌ల‌కుండా ఎన్నిక‌ల కోసం వాడేసుకోవ‌డం శోచ‌నీయం.

Also Read:  Janasena Chief Pawan Kalyan: పవన్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్సార్ వారికన్నా గొప్ప నాయకుడా..?