Janasena : `వారాహి`ప‌నైయిపోయింది! ఇక సీఎం అయితేనే..!

ప‌దో ఆవిర్భావం సంద‌ర్భంగా మ‌చిలీప‌ట్నం వేదిక‌పై ప‌వ‌న్ (janasena )

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 03:48 PM IST

జ‌న‌సేన(Janasena) ప‌దో ఆవిర్భావం సంద‌ర్భంగా మ‌చిలీప‌ట్నం వేదిక‌పై ప‌వ‌న్ (Pawan kalyan ) ప్ర‌సంగం భ‌విష్య‌త్ రాజ‌కీయానికి ప‌రోక్ష సంకేతాల‌ను ఇచ్చింది. ప్ర‌త్యేకించి క్యాడ‌ర్ కు ప్ర‌త్య‌క్షంగా ఇచ్చిన‌ దిశానిర్దేశం పెద్ద‌గా ఏమీ క‌నిపించ‌లేదు. క‌నీసం `వారాహి` యాత్ర రాష్ట్ర వ్యాప్తం ఎప్పుడు? అనేది కూడా చెప్ప‌లేదు. తొలి నుంచి బీజేపీ క‌లిసి రాలేద‌ని ఆ పార్టీ మీద అసంతృప్తి వ్య‌క్త‌ప‌రిచారు. తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి అనే సంకేతం ఇచ్చారు. అయితే, గౌర‌వ ప్ర‌దంగా పొత్తు ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని న‌ర్మ‌గ‌ర్భంగా రంగ‌రించారు.

`వారాహి` యాత్ర రాష్ట్ర వ్యాప్తం ఎప్పుడు? (Janasena)

జ‌న‌సేనాని(Janasena) స్పీచ్ లో ఎక్కవ భాగం కులాల గురించి ప్ర‌స్తావించారు. క‌మ్మ‌, కాపు కులాల‌కు పుట్టిన వ్య‌క్తిగా వంగ‌వీటి రాధాను ఉద‌హ‌రించారు. కానీ, ఆయ‌న వంగవీటి రంగా, ర‌త్న‌కుమారి వార‌సునిగా. ఇటీవ‌ల రెడ్డి, క‌మ్మ త‌దిత‌ర కులాల వాళ్ల ను కాపులు చేసుకుంటున్నార‌ని ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తావ‌న లేకుండా (Pawan kalyan) దాట‌వేశారు. కానీ, వంగ‌వీటి రంగా, ర‌త్న‌కుమారి వార‌సునిగా రాధాను ప్ర‌స్తావించ‌కుండా క‌మ్మ‌, కాపుల‌కు పుట్టార‌ని ఏదో చెప్ప‌బోయారు. అంటే, కాపులు అగ్ర‌వ‌ర్ణాల‌కు ఏ మాత్రం తీసిపోర‌ని చెబుతూనే ఐక్యంగా ఉండాల‌ని కోరారు. కాపుల‌కు రాజ్యాధికారం కోసం బీసీ, ఎస్టీ, ద‌ళితుల‌ను క‌లుపుకుని పోవాల‌ని చెప్ప‌డం ఆలోచింప చేస్తోంది. సీఎంగా కాపు కులం వ్య‌క్తి ఉండాల‌ని ఘంటాప‌థంగా చెబుతోన్న ప‌వ‌న్ అన్ని కులాల‌కు రాజ్యాధికారం కావాల‌ని చెప్ప‌డం విచిత్రం.

క‌మ్మ‌, కాపు కులాల‌కు పుట్టిన వ్య‌క్తిగా వంగ‌వీటి రాధాను ఉద‌హ‌రించారు

సాధార‌ణంగా అంద‌రికీ రాజ్యాధికారం పంచాల‌నుకునే నాయ‌కుడు(Janasena) త్యాగానికి సిద్ధం కావాలి. కాపుల మ‌ద్ధ‌తు ఇస్తూ ఇత‌ర కులాల‌కు రాజ్యాధికారం ఇవ్వాలి. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, ఎస్సీ, ఎస్టీల‌కు రాజ్యాధికారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించాలి. అందుకు భిన్నంగా కాపులు సీఎం కావ‌డానికి ఇత‌ర కులాలు అంద‌రూ స‌హ‌కారం అందించాల‌ని ప‌వ‌న్(Pawan kalyan) కోరుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత ధైర్యంగా చెప్పిన నాయ‌కుడు ఎవ‌రూ లేరు. రాజ‌కీయ చ‌రిత్రలో త‌న కులాన్ని సీఎం చేయ‌డానికి మిగిలిన వాళ్లు మ‌ద్ధ‌తు ఇవ్వాల‌ని పిలుపు ఇచ్చిన మొద‌టి నాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ . సమాజాన్ని కాపులు న‌డిపించాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. అదే స‌మ‌యంలో కాపు కులాన్ని కాద‌ని వెళ్ల‌లేనంటూ సొంత కులం సానుభూతి కోసం ప్ర‌య‌త్నించారు. రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ప్ర‌స్తావించ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడారు. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌ను పెద్ద సెక్టార్ గా భావిస్తూ కాపు కులంతో ఆ సెక్టార్ ను క‌లిపుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఇచ్చిన స్పీచ్ మేధావుల్ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Also Read : Janasena : మ‌చిలీప‌ట్నం స‌భ‌పై`సువేరా`క‌థ‌నం వైర‌ల్

ఏపీలో సంఖ్యాప‌రంగా అతి పెద్ద కులం కాపు అంటు చెబుతూ, అందుకే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌య‌ప‌డుతున్నార‌ని ప‌వ‌న్(Pawan kalyan) భావించారు. పైగా కాపులు మిగిలిన కులాల‌తో క‌లిసి ఉండాల‌ని దిశానిర్దేశం చేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. కాపుల్లో ఐక్య‌త లేద‌ని ఆయ‌నే చెబుతారు. ఇత‌ర కులాల‌కు శ‌త్రువులుగా ఉన్నార‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం(Janasena) అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈసారైనా కాపులు త‌న‌ను న‌మ్మాల‌ని వేడుకున్నారు. కాపులు ఓట్లు వేస్తే, గెలుపు త‌థ్య‌మ‌ని చెబుతూ ఇత‌ర కులాలను కూడా ఓటేయాల‌ని రాజ్యాధికారం దిశ‌గా ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా వంగ‌వీటి రాధా గురించి ప్ర‌త్యేకంగా ఆయ‌న ప్ర‌స్తావించ‌డం వెనుక రాజ‌కీయ కోణం లేక‌పోలేదు.

కాపు ఐకాన్ గా ఇంత‌కాలం ఉన్న రాధాను కాద‌ని (Pawan kalyan)

ప్ర‌స్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. ఆయ‌న ప్రాబల్యం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప‌నిచేస్తోంది. మిగిలిన చోట్ల స్వ‌ల్పంగా ఉంటుంద‌ని రాజ‌కీయ నిపుణుల అంచ‌నా. అందుకే, కాపు ఐకాన్ గా ఇంత‌కాలం ఉన్న రాధాను కాద‌ని త‌న‌వైపు (Pawan kalyan) సొంత కులాన్ని తిప్పుకునే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ చేశారని అనిపిస్తోంది. మ‌చిలీప‌ట్నం స‌భ స‌న్నాహాక స‌మావేశాల్లోనూ కాపు, బ‌లిజ కులాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తండ్రి కాపు, త‌ల్లి సూర్య బ‌లిజ అంటూ త‌న సొంత కులాన్ని చెబుతూ రెండూ ఒక‌టే అనే కోణాన్ని ఆవిష్క‌రించారు. ఇక తెల‌గ‌, ఒంట‌రి కులాలు కూడా కాపుల్లో భాగంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఒక‌ప్పుడు వంగవీటి రంగా చేసిన ప్ర‌య‌త్నంలా కాపు, బ‌లిజ , తెల‌గ‌, ఒంట‌రి కులాల్లోని గ్యాప్ ను త‌గ్గించే ఎత్తుగ‌డ ప‌వ‌న్ (Janasena)వేశారు. ఆవిర్భావ స‌భ‌లోనూ అదే చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం బాగానే ఉంది. కానీ, వంగ‌వీటి రాధా గురించి ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రం కోసం మెడ కోసుకునే యువ‌త ఏపీలో లేద‌ని..

తెలంగాణాలో మాదిరిగా రాష్ట్రం కోసం మెడ కోసుకునే యువ‌త ఏపీలో లేద‌ని ఆయ‌న(Janasena) ప్ర‌స్తావించ‌డం శోచ‌నీయం. తెలంగాణ‌లో ఎందుకు పుట్ట‌లేక‌పోయాను? అంటూ గ‌తంలోనూ ఆయ‌న బాధ‌ప‌డుతూ మాట్లాడిన‌ విష‌యం విదిత‌మే. ఏపీ యువ‌త‌, ఆ ప్రాంతం మీద ఆయ‌న‌కున్న చుల‌క‌న భావాన్ని మ‌చిలీప‌ట్నం స‌భ‌లోనూ వ్య‌క్త‌పరిచారు. మొత్తంగా `వారాహి` ఎప్పుడు క‌దులుతుందో చెప్ప‌కుండా రోజుకు రూ. 2కోట్లు ఆదాయం ఉంద‌ని చెబుతూ కాపు కులం చుట్టూ మ‌చిలీప‌ట్నం స‌భ‌ను తిప్పుతూ ముగించారు.(Pawan kalyan)

Also Read : Pawan Kalyan: జనసేన ఈసారి బలిపశువు కాదు.. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా: జనసేన అధినేత పవన్ కల్యాణ్