Janasena-TDP : వారాహి, యువ‌గ‌ళం `సుప్రీం` షో, జీవో నెంబ‌ర్ 1 ట్విస్ట్

లోకేష్‌,ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena-TDP) ఏపీ యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు.

  • Written By:
  • Updated On - January 19, 2023 / 02:52 PM IST

తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌, జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena-TDP) ఇద్ద‌రూ ఏపీ యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. లోకేష్ కంటే ఒక రోజు ముందు `వారాహి` రంగంలోకి దిగ‌నుంది. ఈనెల 24న తెలంగాణ‌లోకి కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు చేయించిన త‌రువాత ఏపీకి `వారాహి` ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈనెల 26వ తేదీ నుంచి ఆయ‌న `వారాహి` యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఇక ఈనెల 27వ తేదీ నుంచి లోకేష్ పాద‌యాత్ర (Yuvagalam)కు శ్రీకారం చుట్ట‌బోతుఉన్నారు. ఇద్ద‌రూ(Janasena-TDP) ఒకేసారి ప్ర‌జాక్షేత్రంలోకి దూకుతున్నారు.

లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena-TDP) ఏపీ యాత్ర‌

ఈనెల 27న స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జ‌యంతి. ఆ రోజు నుంచి లోకేష్ పాద‌యాత్ర ప్రారంభించ‌డం సెంటిమెంట్ ను క‌లిగి ఉంది. కుమారుడు పాదయాత్రపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. సంక్రాంతికి స్వగ్రామం వెళ్లి తిరిగొచ్చిన ఆయ‌న‌ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, పార్టీ నేతలు టీడీ జనార్దన్‌, అశోక్‌బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

Also Read : Yuva Galam : ముద్దులు, హ‌గ్ లు నిషేధం! నిరాడంబ‌రంగా `లోకేష్‌` యువ‌గ‌ళం!

యువ గళం (Yuvagalam)పేరుతో ఈ నెల 27 నుంచి లోకేశ్‌ తన పాదయాత్ర నిర్వహణ, విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా ఏర్పడే ఆటంకాలు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ పాదయాత్ర వ్యూహాత్మకంగా విజయవంతం చేయడానికి పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రపై పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసే నిమిత్తం గురువారం క్షేత్ర‌ స్థాయి నేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వర్తమాన రాజకీయాలు, వివిధ అంశాలకు సంబంధించి పార్టీ కమిటీల పనితీరు వంటివి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

రెండు రోజుల ముందుగా కుప్పంకు..

రెండు రోజుల ముందుగా కుప్పంకు చేరుకోవ‌డానికి ప్లాన్ చేసుకోవాల‌ని చంద్ర‌బాబు లీడ‌ర్ల‌కు సూచించారు. నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిలు, జిల్లా అధ్య‌క్షులు, పార్ల‌మెంట‌రీ పార్టీ లీడ‌ర్లు, వివిధ జిల్లాల కో ఆర్డినేట‌ర్లు, జిల్లా, మండ‌ల స్థాయి లీడ‌ర్లు ఈనెల 27వ తేదీ హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. అంతేకాదు, రెండో రోజుల ముందుగా ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు కుప్పం చేరుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, రాష్ట్ర స్థాయి లీడ‌ర్లంద‌రూ లోకేష్ పాద‌యాత్ర రోజు ఉండాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన క‌స‌ర‌త్తు సీరియ‌స్ గా జ‌రుగుతోంది.

Also Read : Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!

జీవో నెంబ‌ర్ 1  పై హైకోర్టు ఇచ్చిన  స్టేను స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్ వేసింది. సుప్రీం కోర్టు దానిపై గురువారం విచార‌ణ చేయ‌నుంది. ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చే డైరెక్ష‌న్ కోసం టీడీపీ, జ‌న‌సేన ఎదురుచూస్తోంది. ప్ర‌జా క్షేత్రంలోకి ఏ స్థాయిలో రావ‌డానికి వీలుందో తెలియ‌చేసే తీర్పు సుప్రీం ఇవ్వ‌నుంది. సుప్రీం ఆదేశం మేర‌కు యువ‌గ‌ళం, వారాహి యాత్ర‌ల రూప‌క‌ల్ప‌న ఉంటుంది. మొత్తం మీద ఏపీ రాజ‌కీయాల్లో సుప్రీం కోర్టు తీర్పు, ప‌వ‌న్, లోకేష్ యాత్ర‌ల చుట్టూ తిరుగుతోంది.