Site icon HashtagU Telugu

Janasena – TDP Joint Action Committee : మూడు రోజులపాటు టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు

Janasena Tdp Joint Action

Janasena Tdp Joint Action

రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) తో కలిసి జనసేన (Janasena) బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. రీసెంట్ గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో టీడీపీ – జనసేన పార్టీల సమన్వయ సమావేశం (Janasena – TDP Joint Action Committee) కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి రెండు పార్టీలు కలిసి సమన్వయ సమావేశాలు జరపబోతున్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబర్ 29న శ్రీకాకుళం, విజయనగరం, తర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు ఉంటాయని.. అనంతరం.. 31న విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం అవుతామని ఇరు పార్టీల నేతలు తెలిపారు. అలాగే నవంబర్ రెండోవారంలో జనసేన-టీడీపీ జేఏసీ రెండో భేటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక మొన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో పాటు వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటం, రాష్ట్రంలోని అన్నీ వర్గాలు అభివృద్ది చెందాలనే మూడు తీర్మానాలను ఈ సమావేశంలో చేశారు. అలాగే జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడిగా చేపట్టబోయే భవిష్యత్‌ కార్యక్రమాలపై ఉమ్మడి కార్యాచరణను, ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించినట్లుగా లోకేష్, పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోవాలి..రాష్ట్రంలో జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలన్న ప్రధాన అజెండాతోనే నేటి సమావేశం జరిగిందన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో 14ఏళ్ల బాలుడ్ని చంపిన వ్యక్తికి బెయిల్ వచ్చింది… కానిఅక్రమంగా అరెస్ట్ చేసిన 73ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడికి బెయిల్ రాకుండా ప్రభుత్వం టెక్నికల్‌గా అడ్డుపడుతోందని జనసేన పవన్ కల్యాణ్ అన్నారు.

Read Also : Kavitha Kalvakuntla: కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదు: కల్వకుంట్ల కవిత