Kapu Community Reaction : టిడిపి తో జనసేన పొత్తు ఫై కాపు సామాజిక వర్గం రియాక్షన్ ఏంటి..?

పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలనే అనుకుంటున్నారు. చంద్రబాబు తో సంబంధం లేదు..ఈసారి కాపు నుండి ఓ సీఎం ను చేయాలి..అది పవన్ కళ్యాణ్ అని గట్టిగా ఫిక్స్ అవుతున్నారు

  • Written By:
  • Updated On - September 15, 2023 / 11:47 AM IST

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest)..పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం..టీడిపి తో పొత్తు ఫిక్స్ చేయడం ఇవన్నీ ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశాయి. మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ టీడిపి తో పొత్తు (Jansena-TDP alliance) ఉన్నట్లే అని చెప్పకనే చెపుతూ వచ్చాడు కానీ పబ్లిక్ గా ప్రకటన చేయలేదు. ఎన్నికల సమయం నాటికీ చెప్పిచ్చు అనే ధోరణిలో ఉన్నాడు. కానీ చంద్రబాబు ను అరెస్ట్ చేయడం..బెయిల్ కూడా రానివ్వకుండా చేయడం..తనను ఏపీకి రాకుండా అడ్డుకోవడం ఇవన్నీ చూసి పవన్ ఇక సైలెంట్ కుదరదని..వార్ ప్రకటించాల్సిందేనని గురువారం..జైల్లో చంద్రబాబు ను కలిసిన అనంతరం మీడియా ఎదుట పొత్తు ఫిక్స్ చేసారు. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి కలుస్తున్నామని స్పష్టం చేసారు.

గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan CM) ను సీఎం గా చూడాలని అభిమానులు, కాపు సామాజిక వర్గ ప్రజలు చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని..పక్కాగా సీఎం కుర్చీలో కూర్చువడం ఖాయం అని భావిస్తున్నారు. మరోవైపు టీడిపి సైతం సీఎం కుర్చీ కాదు..జగన్ ను గద్దె దించడమే మన అజెండా అనే నిర్ణయంలో ఉంది. ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి శ్రేణులు సైతం..సీఎం కుర్చీ కంటే..మన అధినేతను జైల్ కు పంపించిన వారి సంగతి చూడాలి..ఆలా చూడాలంటే అధికారం లోకి రావాలి..ఆ అధికారం రావాలంటే పవన్ తో చెయ్యి కలపాలి ..ఆలా కలిపితేనే జగన్ ను ఇంటికి పంపించవచ్చని ఫిక్స్ అవుతున్నారు.

టిడిపి శ్రేణుల సంగతి ఆలా ఉంటె.. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై చేసిన ప్రకటన తర్వాత కాపు సామాజిక వర్గం రియాక్షన్ (Own Kapu Community) ఏంటనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మౌనంగా కనిపిస్తున్న కాపు సామాజిక వర్గం లోలోపల ఏమనుకుంటోంది, పవన్ నిర్ణయానికి కాపుల మద్దతు ఎంత వరకు ఉంటుందనే అనే చర్చ నడుస్తుంది. పవన్ కు అధికారం దక్కాలంటే చంద్రబాబుతో పొత్తు తప్పనిసరి అని భావనను ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీలోనూ నింపడంలో పవన్ సక్సెస్ అయ్యారు. టీడీపీతో పొత్తు తప్పదని పవన్ ఎప్పటి నుండో చెపుతూ వస్తున్నారు. అలాగే కాపు సామాజిక వర్గం తనకు అండగా నిలవలేదని పలుమార్లు బహిరంగసభల్లోనే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు.

Read Also : pragya jaiswal : ఒక్కసారి ట్రెడిషనల్ లుక్ లో మారిపోయిన ప్రగ్య జైస్వాల్

దీన్ని బట్టి చూస్తే కాపులు తనను సీఎం కావాలనుకుంటే తప్పనిసరిగా తన నిర్ణయాలకు అండగా నిలవాల్సిందేనన్న వాతావరణాన్ని పవన్ క్రియేట్ చేసేశారు. ప్రస్తుతమైతే కాపు సంఘాలు కానీ , నేతలు కానీ ఎవరు దీనిపై స్పందించడం లేదు. కానీ లోలోపల మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలనే అనుకుంటున్నారు. చంద్రబాబు తో సంబంధం లేదు..ఈసారి కాపు నుండి ఓ సీఎం ను చేయాలి..అది పవన్ కళ్యాణ్ అని గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. ఇతర కులస్థులు కూడా పవన్ కళ్యాణ్ ను ఓ కాపు వ్యక్తి అని కాకుండా ఓ మంచి మనిషి అని , తనకు కుళ్లు , కుతంత్రాలు తెలియవని , కుల బేధం అనేది లేదని..అలాంటి వ్యక్తి ని సపోర్ట్ చేస్తే..రాష్ట్రం బాగుపడుతుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈసారి ఎన్నికలు మాత్రం తగ్గపోరు ఉంటాయని ఇప్పటి నుండే అర్ధం అవుతుంది.