Janasena : మ‌చిలీప‌ట్నం స‌భ‌పై`సువేరా`క‌థ‌నం వైర‌ల్

సోష‌ల్ మీడియా గ్రూపుల్లో (Janasena) కాపు సామాజిక‌వ‌ర్గం గురించి `సువేరా` (Suvera) పేరుతో

  • Written By:
  • Updated On - March 14, 2023 / 05:51 PM IST

తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా గ్రూపుల్లో (Janasena) కాపు సామాజిక‌వ‌ర్గం గురించి `సువేరా` (Suvera) పేరుతో ఏపీలోని కాపు సామాజిక‌వ‌ర్గం గురించి పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఆయ‌న పూర్తి పేరు సుంక‌ర వెంక‌టేశ్వ‌ర‌రావు గా కొంద‌రు చెబుతున్నారు. అయితే, ఆయ‌న్ను కాంటాక్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా  తీసుకోలేక‌పోయాం.  ఆయ‌న పేరు మీద వైర‌ల్ అవుతోన్న ఒక క‌థ‌నాన్ని య‌థాత‌దంగా ఇక్క‌డ చూపుతున్నాం. ఆయ‌న క‌థ‌నం ఆద్యంత‌మూ ఇలా ఉంది.


“ఆత్మీయ కాపు సోదరులారా”….!
“మీకు మీరే శత్రువులు”
“మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేది, పొడిచింది, పొడుస్తున్నది, పొడవబోయేది మీవాళ్లే”.
ఈ పరిస్థితుల్లో మీ కులంవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అవ్వడం అసంభవం.
అలా అయ్యేదే ఉంటే ఎపుడో అయ్యేవారు.మీ కులంలో ఇద్దరు కలిసి ఉండడం, సఖ్యతగా ఉండడం, ఓకేమాట మీద ఉండడం మనం ఎప్పుడూ చూడలేము.మీరు ఇన్నాళ్లూ మీ కులనాయకులుగా నమ్ముకున్న, మీ కులంవాళ్ళల్లో చాలామందిలో ఉన్న స్వార్ధాన్ని నాయకత్వలోపాన్ని బలహీనతలను మీరు అర్ధంచేసుకోలేకపోయారు, ఆత్మపరిశీలన చేసుకోలేదు, ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు.

Also Read : Janasena: నేడే జనసేన ఆవిర్భావ సభ.. సభ వేదికకు పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం..!

ముద్రగడ ఉమ్మారెడ్డి అంబటి బొత్స రామచంద్రయ్య లాంటివాళ్ళు మీ కులానికి చేసిన ద్రోహం  ఏమేరకు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? తుని రైలు దహనం లాంటివి ఏమేరకు సబబో? అన్నది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి.తుని ఘటన ఇతర అన్యకులస్తులకు మిమ్మల్ని సామాజికంగా రాజకీయంగా దూరంచేసింది, ఇందుకు బాధ్యులు మీ ముద్రగడ లాంటివారు కాదా?ఒక్కమాటలో చెప్పాలంటే మీ కులంలో “మీవాళ్లకు మీవాళ్లే శత్రువులు”.మీలో మీకు ఐక్యత సఖ్యత ఉండదు, మీలో ఆవేశం అసహనం నోటితోందర ఎక్కువ.ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇతరులను నిందించడం సబబేనా? మీవాళ్ళు ఎల్లప్పుడూ ఇతర కులస్తులను నిందించడంలోనే మీవాళ్ళ బలహీనత ఆత్మన్యూనత స్పృష్టమవుతుంది.

Also Read : Pawan Politics: ఏపీతో పవన్ ఆట, మచిలీపట్నంలో రిహార్సల్స్

మీవాళ్ళు శత్రువుగా ఎన్నుకోవాల్సిన వర్గాలను కులాలను, మీవాళ్ళు రాజ్యాధికారం కోసం ఏ ప్రధాన కులాన్ని, వర్గాన్ని టార్గెట్ చేయాలో, అదే కులం, అదే వర్గం పంచనచేరి, పదవులకోసం సొంత కులానికి వెన్నుపోటు పొడిచేది మీకుల కులనాయకులే.నీలం సంజీవరెడ్డి కాలం నుండి నేటికీ జరుగుతున్నది ఇదే, మరీ ముఖ్యంగా గత ముప్పై ఏళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి జరుగుతున్నది కూడా ఇదే.గత ముప్పైఏళ్లుగా రాయలసీమప్రాంత వైఎస్ కుటుంబాన్ని గుడ్డిగా నమ్మి, అనుసరించి ఎవరు మోసపోయారో మీకు తెలియదా? ఎవరిని ఎవరు మోసగించారో మీకు తెలియదా? ఎవరిని ఎవరు వెన్నుపోటు పొడిచారో మీకు తెలియదా? మిమ్మల్ని గత ముప్పైఏళ్లుగా కూరలో కరివేపాకు లాగా వాడుకుని వదిలేసింది వైఎస్ కుటుంబం కాదా? మీవాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

మీవాళ్లకు రాజ్యాధికారం రాకుండా ఇన్నాళ్లూ అడ్డుపడింది ఏ వర్గమో మీకు అంచనాలేదా? మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కింది ఏ ప్రాంతానికి చెందిన ఏ కులమో మీకు తెలియదా ? గత ముప్పైఏళ్లుగా మీ కులాన్ని అడ్డుపెట్టుకుని, మీ కులాన్ని ఇతర కులాల మీదకు రెచ్చగొట్టి లాభపడింది, రాజ్యాధికారం పొందింది, రాజ్యాధికారం అనుభవిస్తున్నది ఎవరో మీకు అంచనాలేదా? విజయవాడలో కీశే.వంగవీటి మోహనరంగా ఎదుగుదలను సహించనివాళ్ళు, ఆ హత్యవెనక అసలు సూత్రధారులు ఎవరో మీకు తెలియదా? రంగా హత్యవలన కమ్మవాళ్లకు చేకూరే లాభమేమిటో మీరే ఆలోచించుకోవాలి.ఇన్నాళ్లూ వైఎస్సార్ కుటుంబ పల్లకీ మోసింది, మోస్తున్నది, వైఎస్ కుటుంబాన్ని అందలం ఎక్కించింది ఎవరో మీరే అంచనావేసుకోండి? వైఎస్ కుటుంబం వలన నిలువునా మోసపోయింది ఎవరో మీరే ఆత్మపరిశీలనతో ముందుకెళ్లండి? మీలో కొంతమంది స్వార్ధపరులైన వాళ్లకు నాలుగు పదవులు ఇచ్చి, నలభై వాళ్లే మింగారని మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి.

Also Read : Pawan Sabha: కాపు కోటలో పవన్ సభ, ఇద్దరు నానిల ఇలాఖలో శంఖారావం

మోసగాళ్లను నయవంచకులను నమ్మడంలో మీకు మీరే, ఎవరైతే మీవాళ్లకు అనుకూలంగా ప్రేమతో ఉంటారో వాళ్ళను వాచాలత్వంతో తూలనాడడంలో నిందించడంలోనూ మీకు మీరే సాటి, మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోవడంలో మీరే సిద్ధహస్తులు. గతంలో ఎంతో ప్రజాదరణ కలిగిన సినీనటుడు శ్రీ చిరంజీవి కూడా రాజ్యాధికారం పొందాల్సిన తరుణంలో తాను కేవలం ఒక కులనాయకుడిగా, ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఒక కులపార్టీగా మార్చేసి, ఆ కులాన్ని చావుదెబ్బకొట్టి నిలువులోతున ముంచేసిన సంగతి ఇంకా ఎవ్వరూ మరచిపోలేదు, దీని వెనుక వైఎస్ కుట్రలను మీరు ఇంకా విశ్లేషించుకోలేకపోవడం, మీరు ఇతరులమీద విమర్శలు చేయడం ఇది విచారకరం.

Also Read : Pawan : జ‌న‌సేన‌కు కులం,మ‌తం బుర‌ద‌! కాపు,బ‌లిజ వాదం!!

మీలో నేడున్న (Janasena)నాయకులలో కీశే.మండలి వెంకటకృష్ణారావు, కీశే.మింటే పద్మనాభం, కీశే.వడ్డీ వీరభద్రరావు, తెలంగాణాకి చెందిన శ్రీ ధర్మపురి శ్రీనివాస్(డీ.శ్రీనివాస్), శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, జ్యోతుల నెహ్రు, మాజీ ఐపీఎస్ శ్రీకృష్ణారావు, శ్రీసాంబశివరావు, శ్రీలక్ష్మీనారాయణ, డా.సింహాద్రి చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది శ్రీచిదంబరం లాంటివారు ఎందరున్నారు? మీరు పైన పేర్కొన్న ఉన్నతులు ఉత్తములు మేధావులు, రాజకీయచతురత కలిగిన సౌమ్యులు, మృదుభాషులు రాజకీయ వ్యూహం, దీర్ఘదృష్టి, దూర ఆలోచన, వివేకం కలిగిన నాయకులు, నిర్వివాదులు (నాన్ కాంట్రవర్సల్స్) ఎంతోమంది ఉన్నారు, అలాంటివారి మార్గదర్శనంలో సమాజంలో ఇతరులను అందరినీ కలుపుకుని మీరు ముందుకెళ్లాలని, మీకు బలమైన రాజకీయ వర్గశత్రువు ఎవరో మీరు తెలుసుకుని, ఆ శత్రువుని ఎన్నుకొని రాజ్యాధికారం పొందాలని ఆశించండి.

ముద్రగడ ఉమ్మారెడ్డి రామచంద్రయ్య అంబటి

నేడు మీ కులనాయకులుగా చెప్పుకునేవాళ్ళు అత్యధికులు మీకులాన్ని అడ్డుపెట్టుకుని స్వార్ధప్రయోజనాలు పొందడానికి తప్పించి, మీ కులప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని అనుకుందామా?
మీకులంలోని ముద్రగడ ఉమ్మారెడ్డి రామచంద్రయ్య అంబటి త్రిమూర్తులు లాంటివారి వలన మీకులానికి ఏమైనా కించిత్తు లాభం జరిగిందా? లేక, మీకులాన్ని అడ్డంపెట్టుకుని వాళ్ళు ఎదిగారా? ఆలోచించుకోండి. మీ ముద్రగడే మీ కులానికి వెన్నుపోటు పొడవలేదా? మీ ముద్రగడ మీ కులాన్ని అడ్డంపెట్టుకుని ఇతరులను బ్లాక్ మెయిల్ చేయలేదా? మీ కులాన్ని వైఎస్సార్సీపీకి అమ్మేయలేదా?

అది మీ ఒక్క కులమేకాదు, ఏకులంలోనాసరే నేడు జరిగేది జరుగుతున్నది ఇంతే.!ఏవారైనా బయటకు తమ కులం   గురించి ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆ కులానికి వెన్నుపోటు పొడుస్తున్నట్లే లెక్క, అటువంటి వాళ్ళు వాళ్ళ కులాన్ని స్వార్ధానికి ఉపయోగించుకోబోతున్నారని అర్ధం. నేడు మీకులంలో కూడా అంతే.! కులం కులం అని తెగ మాట్లాడే మీకులంలోని కొందరు, మీ కులం పేరుతో వాళ్ళు రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా పెరగాలని తాపత్రయం తప్పించి, మీ కులానికి వాళ్ళేదో ఊడపొడుద్దామని కానేకాదు.

గతచరిత్రను పరిశీలిస్తే, ఎక్కడైనా

ముందుగా మీరు ఆత్మవిమర్శ ఆత్మావలోకనం చేసుకోవాల్సింది మీకు ఇతర కులాలతో గొడవలు స్పర్ధలు విభేదాలు వైరాలు ఎందుకు వస్తున్నాయి? అని మాత్రమే.!ముందుగా మీరు వాటిని పరిష్కరించుకుని తరువాత రాజ్యాధికారం గురించి ఆలోచించండి.అసలు ఇంతకీ మీకు సమాజంలో సాటి కులాలతో అందరితోనూ ఆగర్భవైరం ఎందుకుంటోందో మీలో మీరు ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకుని విశ్లేషించుకున్నారా?మనం గతచరిత్రను పరిశీలిస్తే, ఎక్కడైనా.. కాపులకు సహకులాలైనటువంటి, వ్యవసాయాధార కులాలైనటువంటి మెజారిటీ కులాలతో వైరం, కాపులకు – పల్లెకారులకు వైరం, కాపులకు – యాదవులకు వైరం, కాపులకు – శెట్టిబలిజలకు వైరం, కాపులకు – గౌడలకు వైరం, కాపులకు – వైశ్యులకు, కాపులకు – బ్రాహ్మణులకు, కాపులకు – దళితులకు, కాపులకు – కమ్మలకు, కాపులకు – రెడ్లకు, కాపులకు – గిరిజనులకు, కాపులకు(రాయలసీమలో బలిజలు) – బోయీలకు, బలిజలకు – కురుబలకు, కాపులకు – పద్మశాలీలకు, కాపులకు – కాళింగులకు, కాపులకు – ముదిరాజులకు, కాపులకు – క్షత్రియులకు, కాపులకు – వెలమలకు, ఇలా అందరితోనూ వైరమే కదా? అసలు ఇన్ని మాటలు ఎందుకు? అసలు కాపులకు – కాపులకే వైరం కదా!, ఇతర సామాజికవర్గాలతో అందరితోనూ వైరం విభేదాలు మరియు మీలో మీకు వైరం/విభేదాలు పెట్టుకుని, ఇలాటి పరిస్థితులలో మీరు రాజ్యాధికారం కావాలని, ముఖ్యమంత్రి అవ్వాలని ఎలా అనుకోగలుగుతున్నారు? ఎలా కోరుకోగలుగుతున్నారు? ఎలా అవ్వగలరు?ముందుగా మీలోని లోపాలను మీరు పరిష్కరించుకోవాలి.

కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమం (Suvera)

మీరు ఎప్పుడైతే కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమం ప్రారంభించారో అప్పుడే మీరు సమాజంలోని ఇతర అన్ని బీసీ వర్గాలకు దూరమయ్యారు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు రాజ్యాధికారం ఎలా వస్తుంది?తెలుగు సమాజంలో మీ కుల శాతం ఎంత? బాగా ఉంటే మీలోని అన్ని కులాలు ఉపకులాలు కలిపి పదిహేను నుండి పద్దెనిమిది శాతం మాత్రమే కదా.?ఈ స్థితిలో, ఊరందరిదీ ఒకదారైతే మీది ఎల్లప్పుడూ మరోదారి.మీలో ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ.మీలో అసహనం ఎక్కువ, దీర్ఘకాల వ్యూహం తక్కువ.నిజంగానే మీరు రాజ్యాధికారం కోరుకునేవాళ్లే అయితే, ఎవరైనా మీవాళ్ళు పెద్దలుగా చెలామణీ అయ్యేవాళ్ళు మీకుల శ్రేయాస్సుకోరేవాళ్లే అయితే, ఎవరైనా కేసీఆర్ పార్టీ భారాసను ఆంధ్రప్రదేశ్ లాంటి సున్నిత రాష్ట్రంలో భుజాలకెత్తుకుంటారా?అలాంటి పార్టీలకు అధ్యక్షులుగా బాధ్యత వహించేవాళ్ళు మీవాళ్ళు, అలాంటి సమయంలో మీరు ముఖ్యమంత్రి పదవిని ఎలా కోరుకోగలుగుతున్నారు? మీకు ఎవరు మాత్రం మిమ్మల్ని నమ్మి ఎందుకు ఓటు వేస్తారు? ఆలోచించుకోండి.!

స్వార్ధపరులైన కులనాయకులను నమ్ముకుంటూ

మీలో ఉద్దండులైనవారు గొప్పవారు మేధావులు ఎలాంటి మచ్చలు లేనివాళ్ళు, విజ్ఞులు ఎందరో ఉన్నారు, అలాంటివారిలో మాజీ ఉన్నత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్సులు, మాజీ డీజీపీలు, పేరెన్నికగన్న వైద్యులు, సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టులు, సాహితీవేత్తలు ఉన్నారు, అలాంటివారితో ఒకవేదిక ఏర్పాటుచేసుకుని, మీకు సమాజంలో సాటి కులస్తులతో మనస్పర్థలు వైరాలు విభేదాలు ఎందుకు వస్తున్నాయో విశ్లేషించుకుని, వాటిని పరిష్కారదిశగానూ అన్యాకులస్తులతో సోదరభావంతో మమేకమై కలిసిపోయి ముందుకువెళ్లే దిశగా ఆలోచించుకివాలి. అలాకాకుండా, ముద్రగడ ఉమ్మారెడ్డి రామచంద్రయ్య హరిరామజోగయ్య లాంటి మరికొందరు నోటిదురుసు వాచాలత్వంతో కూడిన స్వయంప్రకటిత పూర్తిగా స్వార్ధపరులైన కులనాయకులను నమ్ముకుంటూ ముందుకేళితే ఏమిలాభం?

Also Read : Pawan Sabha: కాపు కోటలో పవన్ సభ, ఇద్దరు నానిల ఇలాఖలో శంఖారావం

నిన్న ఒకటి రెండు వీడియోలు చూస్తే అందులో శ్రీ హరిరామజోగయ్య శ్రీ దాసరి రాము ఇద్దరూ మాట్లాడుతూ శ్రీ చంద్రబాబు నాయుడు శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలంట? లేకపోతే వాళ్ళ తడాఖా చూపిస్తారట? ఇదేమి విడ్డూరం? వినడానికి హాస్యాస్పదంగా లేదూ?ఇతరులు వింటే ఏమనుకుంటారోననే కనీస ఇంగితజ్ఞానం వాళ్లకు ఉండాలికదా? శ్రీ చంద్రబాబు నాయుడు ఒక బలమైన ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉంటూ, తాను ఇతరపార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాడా? ఇదెక్కడైనా సబబేనా?ఉదాహరణకు, నాడు శ్రీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది తాను ముఖ్యమంత్రి అవ్వడానికా? లేక, ఇతర కులస్తులను బీసీలను ఎస్సీ ఎస్టీ లను ముఖ్యమంత్రిగా చేయడానికా? నేడు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించింది తాను ముఖ్యమంత్రి అవ్వడానికా? లేక, ఇతర కులస్తులను ముఖ్యమంత్రిని చేయడానికా?
మీరు గతంలో ఇదేమాట వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎందుకు అడగలేదు?

పార్టీలో విలీనంచేస్తానని

2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు?పోనీ ఇప్పుడైనాసరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కాపుని ముఖ్యమంత్రిని చేయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడగండి, అలాగే తెలంగాణా రాష్ట్రంలో కూడా కేసీఆర్ ని కూడా అడగండి, మీరు తప్పుకుని మా మున్నూరుకాపు కులస్తుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని.తెరాస/భారాస అధ్యక్షుడు శ్రీ కేసీఆర్ ఉద్యమ సమయంలో దళితుడిని తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనంచేస్తానని ప్రకటించి, తెలంగాణా ఏర్పడి ఎన్నికలు అయినాక ఏమయ్యింది? మీకు తెలియదా?ఇంతకీ, సినీనటుడు జనసేనపార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఫక్తు కులనాయకుడిగా మిగిలిపోదాల్చుకున్నారా? తన పార్టీని కేవలం కులపార్టీగా మార్చదల్చుకున్నారా? అనేది ఆయన విచక్షణ వివేకంతో ముడిపడి ఉంది. కులపార్టీలు దేశంలో ఎక్కడా నిలబడిన మనగలిగిన చరిత్ర లేనేలేదు.
కులరాజకీయపార్టీలుగా, కులనాయకులుగా ముద్రపడి/ముద్రవేయించుకుని, స్వీయనియంత్రణ లేకుండా అన్య కులస్తులను తూలనాడుతూ ఈ దేశంలో రాజ్యాంగ పదవులను ఆశించడం, రాజ్యాంగ పదవులు పొందడం అసంభవం, అలా పొందాలనుకోవడం అవివేకమే అవుతుంది.

నాగేంద్రబాబు యొక్క వాచాలత్వం (Janasena)

పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లినట్లుగా, మొన్న విజయవాడలో ఆ కులసభకి శ్రీ పవన్ కళ్యాణ్ వెళుతూ, వాచాలత్వం కలిగిన వైఫల్యనేత శ్రీహరిరామజోగయ్యను మరియు అలాంటి వాళ్ళను మరికొందరిని తీసుకువెళ్లడం అలాగే అనిపించింది.! అక్కడ హాజరైన వాళ్ళల్లో కొందరి ఆత్మవిశ్వాసం మరియు వాళ్ళ మాటలు చూస్తే కేఏపాల్ ప్రజాశాంతిపార్టీ మీటింగుని తలపించింది. ఇంతకీ, తాను అందరివాడినని పలుసార్లు చెప్పుకునే శ్రీ పవన్ కళ్యాణ్, తాను స్థాపించిన జనసేనపార్టీ కులపార్టీనా? లేక, సార్వజనపార్టీనా? అలాగైతే, ఆయన తన సొంత అన్న శ్రీ నాగేంద్రబాబు యొక్క వాచాలత్వం నియంత్రించుకోలేకపోవడం, ప్రతిసారీ కాపుకుల సంఘాల సమావేశాలకు తరచుగా హాజరవ్వడం, మేమే కాపుకుల ఉద్ధారకులము అని చెప్పుకునే కొందరిని వెంటపెట్టుకుని తిరగడం, వాచాలత్వంతో అందరినీ దూషిచేవాళ్లను తన పార్టీ అధికారప్రతినిధులుగా నియమించి ఇతరులకు దూరమవ్వడం, ఇలాంటివాటితో ఆయన అధికారంలోకి ఎలా రాగలరని అనుకుంటున్నారు?

జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం (Suvera)

గతంలో తన అన్న శ్రీ చిరంజీవి ఇలాచేసుకునే కదా రాజకీయ వైఫల్యం చెందింది.! నేడు మచిలీపట్నంలో నిర్వహించుకునే జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కూడా కాపుకుల సమావేశంగానే మార్చేశారు, ఇది కూడా అనాలోచిత వ్యూహాత్మకలోపమే.!నేను ఇలా వాస్తవాలను గుర్తుచేయడం ద్వారా కందిరీగల తుట్టిని కదిలుస్తున్నానని, దీనియొక్క పర్యవసానాలు అసభ్యకరంగా బూతులతో దూషణలతో ఉంటాయని, వ్యక్తిత్వహననం ఉంటుందని కూడా నాకు తెలుసు, అది షరామామూలే, అయినాసరే, మెజారిటీ కాపుసోదరులు సహృదయంతో సభ్యత విచక్షణ వివేకంతో అర్ధంచేసుకునేవాళ్ళు ఉన్నారని భావంతోనే ఈపోస్టు వ్రాసాను. ఇది ఎవరికైనా బాధకలిగించినా, మనోభావాలు దెబ్బతిన్నా నేను చేయగలిగింది ఏమీలేదు, అది వాళ్ళ ఆత్మపరిశీలనకే వదిలేస్తున్నాను, మీ గుండెల మీద చేయివేసుకుని మీరే ఆలోచించుకోండి. ఎవరైనా కాపుసోదరులు ఈ వాస్తవాలతో విభేధిస్తే, మీలో ఒకస్థాయి గుర్తింపు గౌరవం కలిగిన కాపుసోదరులుతో నేను పైన పేర్కొన్న అంశాలపై చారిత్రక రాజకీయ సాంఘీక ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమే.
ఈ పోస్టుని కాపుకులస్తులైనవారు నాకు ఆత్మీయ పెద్దలు, మిత్రులు, సోదరులు, సోదరీమణులు అందరికీ అంకితం.
భవదీయుడు.
~సువేరా.“

Also Read : Janasena : `వారాహి` క‌దిలేది అప్పుడే.! ఆర్భావ స‌భ‌లో జై చంద్ర‌న్న‌ రోడ్ మ్యాప్ ?

ఇదీ ఆయ‌న రాసిన క‌థ‌నం. ఇప్పుడు వైర‌ల్ అవుతోన్న దాన్ని హాష్ ట్యాగ్ లో పెట్టాం. మ‌చిలీపట్నంలో జ‌రుగుతోన్న 10వ జ‌న‌సేన(Janasena) ఆవిర్భావ స‌భ‌, అందుకు గ‌త నాలుగు రోజులుగా జ‌రిగిన స‌న్నాహాల‌ను బేస్ చేసుకుని `సువేరా` (suvera)పేరుతో రాసిన ఒక వ్యాసం. వైర‌ల్ అవుతోన్న న్యూస్ అది.