Janasena Strategy : BJP గేమ్ లో ఆట‌గాడు

జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌ర్ఫెక్ట్ గేమ్ (Janasena Strategy)ఆడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయ‌న పొత్తుల గురించి ఉటంకించారు.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 01:28 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌ర్ఫెక్ట్ గేమ్ (Janasena Strategy)ఆడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయ‌న ఎన్డీయే స‌మావేశం ముగిసిన త‌రువాత పొత్తుల గురించి ఉటంకించారు. రాబోవు రోజుల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతాయ‌ని సంకేతాలు ఇచ్చారు. స‌రిగ్గా ఇక్క‌డే, చంద్ర‌బాబు మీద ప్ర‌మాద‌క‌ర ఆట‌కు బీజేపీ తెర‌లేపింది. దానిలో ప‌వ‌న్ ఆడ‌గాడిగా మారారు. త‌న‌ను సీఎం కావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నాని ఢిల్లీ వేదిక వెల్ల‌డించడం తాజా ప‌రిణామం.

జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌ర్ఫెక్ట్ గేమ్ (Janasena Strategy)

ఇటీవ‌ల దాకా సీఎం రేస్ లో లేనంటూ బ‌హిరంగంగా ప‌వ‌న్ వెల్ల‌డించారు. వారాహి వాహ‌నం ఎక్కిన నాలుగు రోజుల త‌రువాత సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటానంటూ మొద‌లు పెట్టారు. ఇప్పుడు ఏకంగా అంద‌రూ త‌న‌ను సీఎం కావాల‌ని కోరుకుంటున్నార‌ని మ‌రో ట్విస్ట్ (Janasena Strategy)ఇచ్చారు. ఇదంతా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆడిస్తున్న గేమా? లేక ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా చేస్తోన్న రాజ‌కీయ‌మా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తానంటూ తొలి నుంచి ప‌వ‌న్ చెబుతోన్న మాట‌. ఆ త‌రువాత పొత్తు అంటూ ప్ర‌తి నెల‌కు ఒక‌సారి లీకులు ఇస్తూ జ‌నసేన పార్టీని గ‌త మూడేళ్లుగా ప్ర‌జ‌ల్లో న‌లిగేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పెద్ద‌గా ఉద్య‌మాలు, పోరాటాలు చేసిన దాఖ‌లాలు లేవు. సినిమాలు చేసుకుంటూ అప్పుడ‌ప్పుడు ఖాళీగా ఉన్న‌ప్పుడు నెల‌కో, రెండు నెల‌ల‌కో ప‌వ‌న్ ఏపీ విజిట్ చేశారు. గ‌త మూడేళ్లుగా చెప్పుకోద‌గ్గ రాజ‌కీయ పోరాటాలు ఎక్క‌డా చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన పార్టీని వ్యూహాత్మ‌కంగా  (Janasena Strategy) వైసీపీ కూడా హైలెట్ చేస్తూ వ‌చ్చింది.

జ‌న‌సేన పార్టీని వ్యూహాత్మ‌కంగా వైసీపీ కూడా హైలెట్ చేస్తూ

ఒన సైడ్ ల‌వ్ అంటూ కుప్పం వేదిక‌గా చంద్ర‌బాబు చేసిన ఒకేఒక కామెంట్ జ‌న‌సేన పార్టీకి పున‌రుజ్జీవం పోసింది. ఆ త‌రువాత మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన ఆఫీస్ కు లోకేష్ అప్ప‌ట్లో వెళ్ల‌డం ఆ పార్టీకి మ‌నోధైర్యం పెరిగింది. అంతేకాదు, వ్యూహాత్మ‌కంగా టీడీపీని కార్న‌ర్ చేస్తూ పొత్తు లేకుండా అధికారం రాద‌నే సంకేతాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ప‌వ‌న్ తీసుకెళ్లారు. ప‌దేళ్లుగా రిజిస్ట్ర‌ర్ పార్టీగా మాత్ర‌మే ఉన్న జ‌న‌సేన సినిమాటిక్ గా  (Janasena Strategy) చంద్ర‌బాబు మీద గేమ్ ప్లే చేసింది. దానిలో చంద్ర‌బాబు పడిపోయారు. సీన్ క‌ట్ చేస్తే, సీఎం ప‌ద‌వి త‌న‌కు ఇస్తే బాగుటుంద‌ని అంద‌రూ భావిస్తున్నార‌న్న స్థాయికి ప‌వ‌న్ వెళ్లారు.

Also Read : Janasena : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రులు నోరుపారేసుకోవ‌ద్దు.. మంత్రుల‌కు జ‌న‌సేన నేత హెచ్చరిక

ఎన్డీయే కూట‌మిలో చేరాల‌ని చంద్ర‌బాబు భావించారు. కానీ, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు టీడీపీకి ఆహ్వానం కూడా పంప‌లేదు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌న్న ప‌వ‌న్ మాత్రం ఎన్టీయే స‌మావేశానికి వెళ్లారు. అంటే, బీజేపీని వ‌దులుకుని రాజ‌కీయాలు న‌డ‌ప‌లేమనే భావ‌న జ‌న‌సేన పార్టీలో (Janasena Strategy) ఉంద‌న్న‌మాట‌. రెండు పార్టీలు క‌లిసి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన‌ప్ప‌టికీ ఫ‌లితంగా శూన్య‌మ‌ని తెలిసి కూడా చంద్ర‌బాబు మీద ప‌వ‌ర‌ఫుల్ గేమ్ ప‌వ‌న్ ఆడుతున్నారు. బీజేపీ పెద్ద‌లు దూరంగా పెడుతున్నార‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు పొత్తు గురించి మాట్లాడి చుల‌క‌న కాద‌లుచుకోలేద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆ రోజు నుంచి టీడీపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. రాష్ట్రంలోని 175 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డానికి దూకుడుగా చంద్ర‌బాబు స‌మీక్ష‌లు చేస్తున్నారు.

Also Read : Pawan Alliance: ముగ్గురం కలిసే వస్తున్నాం… పొత్తు కుదిరిందిగా

ఎన్డీయే స‌మావేశం ముగిసిన త‌రువాత ఏపీలో బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఉంటుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం వ్యూహంలో భాగం. రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొందుకుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ చేసిన కామెంట్ గా తీసుకోవ‌చ్చు. చివ‌రి వ‌ర‌కు ఇలా పొత్తు ఉంటుంద‌ని చెప్ప‌డం ద్వారా టీడీపీ ఓట‌ర్ల నుంచి వ్య‌తిరేకత లేకుండా చూసుకునే ప్ర‌య‌త్నం ప‌వ‌న్ చేస్తున్నార‌ని బోధ‌ప‌డుతోంది. ముక్కోణ‌పు పోటీ జ‌రిగితే, ప‌వ‌న్ కూడా గెలుస్తాడా? లేదా? అనేది డౌటే. అందుకే, ఇప్ప‌టి నుంచి సానుభూతి గేమాడుతూ రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.