Site icon HashtagU Telugu

Janasena : సీఎం జగన్ ఫై దాడిని పుష్ప మేకింగ్ తో షేర్ చేసిన జనసేన

Janasena Pushpa Making

Janasena Pushpa Making

ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై జరిగిన దాడి (Stone Attack) ఫై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీల నేతలతో పాటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రకరకాల వీడియోస్ తో మీమ్స్ తో ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు. చుట్టూ అభిమానులు , పార్టీ శ్రేణులు , భారీ బందోబస్తు ఇలా అంత ఉండగా..ఎక్కడి నుండో రాయి విసిరితే..అది సరిగ్గా జగన్ కనుబొమ్మకు తగిలి, పక్కనున్న మరో ఎమ్మెల్యేకు తగలడం ఆయన కంటికి గాయం కావడం ఇదంతా ఓ జగన్నాటకం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈ దాడి ఫై జనసేన పార్టీ (Janasena Party) ట్విట్టర్ వేదికగా పుష్ప మేకింగ్ వీడియో తో పోలుస్తూ సెటైర్ వేసింది. పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ గాయమైనట్లు మేకప్ వేసుకునే వీడియోను షేర్ చేసి.. అన్ని అవార్డులూ రాబోతున్నాయని పేర్కొంది. అలాగే జనసేన నేత నాగబాబు స్పందిస్తూ.. వైసీపీ ఇన్నిరోజులు సింపతీ డ్రామాలతో గెలిచిందని ఇకపై అది వర్కవుట్ కాదని , జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. చిన్న దెబ్బకు డ్రామాలు ఎందుకు? ఆ గాయానికి పసుపు రాసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. ఇక సింపతీ నాటకాలు ఎన్ని చేసినా వచ్చేది టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వమే’ అని నాగబాబు తెలిపారు.

ఇదిలా ఉంటె జగన్ ఫై జరిగిన రాయి దాడి ఘటన ఫై విజయవాడ CP కాంతిరాణా టాటా స్పందించారు. ‘ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం. కరెంట్ తీయడం సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమే. సీఎంను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది CMకు తాకి, పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలింది. 8 బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. చీకటి, జనాల రద్దీని ఆసరా చేసుకుని దాడి చేశాడు’ అని తెలిపారు.

Read Also : CP Kanti Rana : సీఎం జగన్‌పై దాడి.. సీపీ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు