Site icon HashtagU Telugu

Pothina Mahesh : విజయవాడ లో జనసేన శ్రేణులు నిరసన..పవన్ ఫై ఆగ్రహం

Janasena Ranks Protest In V

Janasena Ranks Protest In V

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకుంటున్న నిర్ణయాల ఫై పార్టీ నేతలు , శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుండి పొత్తు వద్దు..ఒంటరిగా బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ కు కాపు నేతలు , పార్టీ నేతలు చెపుతున్నప్పటికీ ఏమాత్రం వినకుండా టిడిపి (TDP) తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు సరిపోదని చెప్పి బిజెపి (BJP) ను కూడా కలుపుకున్నారు. సరే పొత్తు కుదుర్చుకున్నారు..దానికి తగ్గుట్లు సీట్లు తెచ్చుకున్నారా అంటే అది లేదు. జనసేనలో నేతలే లేనట్లు కేవలం 21 సీట్లు తెచ్చుకున్నారు. ఆ 21 స్థానాలు కూడా ఏదో అక్కడక్కడా తీసుకున్నారు కానీ పట్టున్న స్థానాలను వదిలేసుకున్నారు. దీంతో గత పదేళ్లుగా ఆ స్థానాలపై పట్టుబిగుస్తూ వచ్చిన వారికీ టికెట్ లేదని చెప్పేసరికి వారంతా పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా విజయవాడ వెస్ట్ టికెట్ వదులుకోవడం ఫై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ముందు నుండి ఈ స్థానం నుండి జనసేనానికి సన్నిహితుడుగా చెప్పుకునే పోతిన మహేష్ (Pothina Mahesh) పోటీ పడుతున్నారు. ఇక్కడ ఈయనకు ఎంతో గుర్తింపు , బిసి సామజిక బలం కూడా ఉంది. మహేష్ విజయం ఖాయమని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా బిజెపి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బిజెపి కి ఇవ్వడం ఫై మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన తరుపు అభిమానులు..మహేష్ కే టికెట్ ఇవ్వాలంటూ నిరసన బాట పట్టగా..ఈరోజు విజయవాడ లో భారీ ర్యాలీ చేశారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ను పోతిన మహేశ్‌కు కేటాయించాలి అంటూ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. జనసేన కార్యకర్తల ర్యాలీతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనసేన నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మహేష్ పార్టీ ని వీడడం ఖాయంగా కనిపిస్తుంది. మహేష్ పార్టీ ని వీడితే చాల దెబ్బె అని చెప్పాలి. ఇప్పటికే పొత్తు కారణంగా కీలక నేతలు , పార్టీ శ్రేణులు బయటకు రాగా..ఇప్పుడు మహేష్ కూడా వెళ్తే అంతే సంగతి.

Read Also : TB Symptoms: సైలెంట్ గా వచ్చి ప్రాణాలు తీస్తున్న క్షయ (TB)