Janasena : సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్న జ‌న‌సేనాని.. సీఐ అంజుయాద‌వ్‌పై..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్నారు. సీఐ అంజుయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్

Published By: HashtagU Telugu Desk
Pawan

Janasena

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం తిరుప‌తి వెళ్ల‌నున్నారు. సీఐ అంజుయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ తిరుప‌తి వెళ్ల‌నున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్‌పై ఫిర్యాదు చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతికి వచ్చి తిరుపతిలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను కలవనున్నారు. అంజుయాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్పీకి వినతిపత్రం అందజేయనున్నారు పవన్. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టె సాయిపై అంజు యాదవ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం జిల్లా ఎస్పీకి పవన్ మెమోరాండం సమర్పిస్తారని, సమస్యను డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. ఈ విషయమై శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో టెలీకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే పవన్, 10:30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు అందజేయనున్నారు.

  Last Updated: 15 Jul 2023, 10:36 PM IST