Janasena: ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం..!

జనసేన పార్టీ (జెఎస్‌పి) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అక్టోబర్ 30న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమావేశం కానుంది.

Published By: HashtagU Telugu Desk
Janasena

Janasena

జనసేన పార్టీ (జెఎస్‌పి) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అక్టోబర్ 30న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమావేశం కానుంది. ఇటీవల విశాఖపట్నంలో పవన్ మూడు రోజుల పర్యటన సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన తీరు, అక్కడ జరిగిన పరిణామాలపై ఆయన చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో బిజెపితో పార్టీ పొత్తు భవిష్యత్తుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యుడు కె. నాగబాబు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొనన్నునారు. ఈ సమావేశంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడలపై కూడా చర్చించనున్నారు. బస్సు యాత్ర వచ్చే ఏడాది నిర్వహించినా.. ముందుగా జిల్లాల పర్యటలను ప్రారంభించేందుకు పవన్ సిద్దమయ్యారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దింతో ఈ నెల 30న జనసేన పీఏసీ సమావేశం కీలక నిర్ణయాలకు వేదిక కానుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో పవన్ పాల్గొంటారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.

  Last Updated: 28 Oct 2022, 11:44 AM IST