Janasena : షెడ్ కు ప‌రిమిత‌మైన ప‌వ‌న్ `వారాహి`! జ‌న‌సేనానిపై కేసీఆర్ షాడో!

జ‌న‌సేనాని (Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ `వారాహి`యాత్ర ఎప్పుడు? ఎందుకు ఆయ‌న ఆ వాహ‌నాన్ని షెడ్ కు ప‌రిమితం చేశారు?

  • Written By:
  • Updated On - February 24, 2023 / 12:45 PM IST

జ‌న‌సేనాని (Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ `వారాహి`(Varahi) యాత్ర ఎప్పుడు? ఎందుకు ఆయ‌న ఆ వాహ‌నాన్ని షెడ్ కు ప‌రిమితం చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న యాత్ర ఉంటుందా? ఉండ‌దా? ఇలాంటి అంశాలు ఎన్నో ఇప్పుడు క్యాడ‌ర్ ను వేధిస్తోన్న అంశాలు. పార్టీ అధిష్టానం నుంచి అప్ప‌ట్లో వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం జ‌న‌వ‌రి 26వ తేదీన ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కావాలి. తెలంగాణాలోని కొండ‌గ‌ట్టు ఆంజనేయుని వ‌ద్ద పూజ‌లు చేసి అక్క‌డ నుంచి విజ‌య‌వాడ దుర్గ‌మ్మ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డం వ‌ర‌కు ఎపిసోడ్ ఆగిపోయింది.

జ‌న‌సేనాని  ప‌వ‌న్ క‌ల్యాణ్ `వారాహి`(Janasena)

`వారాహి`కి (Varahi) తుప్పు ప‌డుతుంద‌ని తాజాగా మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్లు వేశారు. దానికి కొద్దిగా ఆయిల్ వేయండ‌ని లేక‌పోతే త‌ప్పుతో ప‌నికి రాకుండా పోతుంద‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. ఒక వైపు యువ‌గ‌ళం మ‌రో వైపు వారాహిని ఎవ‌రూ ఆప‌లేర‌ని లోకేష్ చెప్ప‌డాన్ని ప్ర‌స్తావిస్తూ అంద‌రూ క‌లిస రండ‌ని అంబ‌టి తాజాగా స‌వాల్ విసిరారు. ఆ సంద‌ర్భంగా `వారాహి` ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించారు. సీరియ‌స్ పొలిటిష‌న్ గా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. ఏదో ప్యాకేజిల కోసం రాజ‌కీయాలు చేయ‌డం మంచిదికాద‌ని విమ‌ర్శించారు.

ప‌వ‌న్ తో  కేసీఆర్ డీల్ వ్య‌వ‌హారం

ఇటీవ‌ల `వారాహి`ని(Varahi) సిద్దం చేసిన క్ర‌మంలో ఆక‌స్మాత్తుగా ప‌వ‌న్ తో (Janasena) కేసీఆర్ డీల్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. మొత్తం 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ కేసీఆర్ ఇచ్చాడ‌ని సోష‌ల్ మీడియాలో తిరిగి వార్త సారాంశం. నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 20కోట్లు చొప్పున 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో చెప్పిన‌ట్టు ప‌వ‌న్ చేసేలా డీల్ కుదిరింద‌ని ప‌లు ర‌కాలుగా న్యూస్ వ్యాప్తి చెందింది. ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను చీల్చ‌డానికి కేసీఆర్ ద్వారా పెద్ద డీల్ న‌డిచింద‌ని ప్ర‌చారం విస్తృతంగా న‌డిచింది. అందుకు త‌గిన విధంగా `వారాహి` యాత్ర‌ను ఆయ‌న ప్రారంభించ‌క‌పోవ‌డం ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది.

Also Read : Janasena : జోగ‌య్య బెడ్ మీద ఊహాత్మ‌క స‌ర్వే! ఏపీ సీఎం ప‌వ‌నేన‌ట!ఇక గోవిందా!!

తొలి నుంచి ప‌వ‌న్ నాన్ సీరియ‌స్ పొలిటియ‌న్(Janasena) గా ఉన్నారు. ఆ ముద్ర‌ను ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా వేశారు. దానికి తగిన విధంగా ఆయ‌న నెల‌కో, రెండు నెల‌ల‌కు ఒక‌సారి ఏపీకి వెళ్ల‌డం వ‌ర‌కు పరిమితం అయ్యారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌డానికి బ‌య‌లుదేరి రిసార్ట్స్ , ఫాంహౌస్ ల్లో సేద తీర‌డం చూశాం. ఈసారి కూడా ఆయ‌న వారాహి(Varahi) యాత్ర‌ను పూర్తిగా చేయ‌లేర‌ని ప్ర‌త్య‌ర్థుల న‌మ్మ‌కం. అందుకే, అంబ‌టి రాంబాబు వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తూ త‌ప్పు బ‌ట్టిన `వారాహి` అంటూ ఘాటుగా విమర్శ‌లు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పార్టీని న‌డుపుతోన్న ప‌వ‌న్ వాల‌కాన్ని ఎండ‌గ‌డుతున్నారు.

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య గేమ్ కు వైసీపీ (Varahi)

గ‌త కొంత కాలంగా పొత్తు అంటూ రాజ‌కీయాన్ని ప‌వ‌న్ (Janasena) ర‌క్తిక‌ట్టించారు. ఇప్పుడు బీజేపీని కాద‌ని రాలేని ప‌రిస్థితుల్లో ఆయ‌న ఉన్నారు. అలాగ‌ని, టీడీపీని క‌లుపుకుని పోలేని సందిగ్ధంలో ఉన్నారు. ఒక వేళ టీడీపీ లేకుండా ఎన్నిక‌ల‌కు వెళితే రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం త‌ప్పదని అంచ‌నా వేస్తున్నారు. ఆ విష‌యాన్ని ప‌వ‌న్ ఇటీవ‌ల సూచాయ‌గా లీకులు ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పవ‌న్ అడుగులు ఎటు ప‌డ‌తాయి? అనేది సందిగ్ధం. క్షేత్రస్థాయిలో ప‌వ‌న్ కూడా వ‌స్తే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య గేమ్ కు వైసీపీ సిద్ధ‌మ‌యింది. అందుకే, `వారాహి`(Varahi) కోసం వైసీపీ నేత‌లు ఎదురుచూస్తున్నారు.
ఆ క్ర‌మంలో అంబ‌టి వ్యంగ్యాస్త్రాల‌కు పదును పెడుతున్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వ‌కుండా ప‌వ‌న్ ఎక్కడికీ క‌దిలే ప‌రిస్థితి లేద‌న్న‌ది నిజం.

Also Read : Janasena : ప‌వ‌న్ CM కోసం హ‌రిరామ‌జోగయ్య `వెట‌ర‌న్` పాలిటిక్స్