Site icon HashtagU Telugu

Nara Lokesh – Janasena : నారా లోకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు

Nara Lokesh (2)

Nara Lokesh (2)

ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాదించబోతున్నామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే..తాజాగా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం నింపుతుంది. ఇప్పటికే టీడీపీ తో జనసేన (Janasena) పొత్తు పెట్టుకోవడం ఫై చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ..సీఎం అభ్యర్థి చంద్రబాబే (Chandrababu CM) అని తేల్చి చెప్పడం..జనసేన శ్రేణుల్లో మరింత ఆగ్రహం నింపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న దానిపై ఇంకా రెండు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అలాగే సీఎం అభ్యర్థి ఫై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పొత్తుల సంగతిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి తేల్చేసే అవకాశాలున్నాయి. ఈ సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్ చేసిన ప్రకటనతో జనసేన లీడర్లు, కార్యకర్తల్లో మరింత అసహనం పెంచేసింది. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది.. చంద్రబాబు, తాను మాట్లాడి డిసైడ్ చేస్తామని పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా లోకేష్ మాత్రం.. సీఎం సీటు విషయంలో షేరింగ్ ఏదీ ఉండదు.. చంద్రబాబే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇంటర్వ్యూల్లో తేల్చిపారేశారు. ఇన్నాళ్ళు జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని ఆ పార్టీ నేతలు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ ఇలా ఏకపక్షంగా మాట్లాడటం ఏంటి.. పవన్ కూడా చంద్రబాబునే మళ్ళీ సీఎం చేయడానికి ఒప్పేసుకున్నాడా? లేక ఇప్పుడు చెబుతున్నట్టు తర్వాతే మాట్లాడుకుందాం అనుకున్నాడా? అన్న అనుమానాలు జనసైనికుల్లో మొదలయ్యాయి.

ఇదే విషయమై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah )..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖ ( Sensational Letter ) రాసారు. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..? అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద ఇప్పుడిప్పుడే జనసేన – టీడీపీ కూటమి బాగుందని అనుకుంటున్నా సమయంలో నారా లోకేష్ చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి. మరి దీనిని వైసీపీ ఎలా క్యాష్ చేసుకుంటుందో..? చూడాలి.

Read Also : Big Boss : బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు షాక్