Site icon HashtagU Telugu

Pawan Kalyan : మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ

Janasena Party Announced Ma

Janasena party announced Machilipatnam MP candidate

Pawan Kalyan: మచిలీపట్నం(Machilipatnam) లోక్ సభ స్థానం(Lok Sabha Seat ) నుంచి జనసేన పార్టీ(Janasena party) తరఫున వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri)ని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో వెల్లడించారు. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోందని, ఇందుకు సంబంధించి తుది కసరత్తు పూర్తయిన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. జనసేనాని ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పవన్‌ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణం, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్‌ తెలిపారు.

Read Also: Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ