Site icon HashtagU Telugu

Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!

tjb

Resizeimagesize (1280 X 720) 11zon

రాజకీయాలకు వీరమరణాన్ని తగిలించిన మహా గొప్ప లీడర్ జనసేనాని పవన్ (Pawan Kalyan). శ్రీకాకుళం జిల్లా యువశక్తి సభ లో ఆయన చేసిన ప్రసంగం ఒంటరిగా వెళితే రాజకీయ వీరమరణం తప్పదన్నట్టు ఉంది. అందుకే వీరమరణాన్ని ఆయన వచ్చే ఎన్నికల్లో తప్పించుకొని టీడీపీ ని ఆశ్రయించారు. లేదంటే ఆ పార్టీ గుర్తింపు గల్లంతు తప్పదు అని గ్రహించారు. ఇప్పటి వరకు జనసేనకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు. కేవలం రిజిస్టర్ పార్టీ మాత్రమే. ఆ పార్టీ కి గ్లాస్ గుర్తు ఈ సారి ఉంటుందని కూడా నమ్మకం లేదు. బహుశా బీజేపీ పొత్తు లేకపోతే గ్లాస్ గుర్తు గల్లంతు కావటం ఖాయం.

ఎందుకంటే , ఏపీలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో స్వాతంత్ర్య అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఒక వేళ బీజేపీ మద్దతు లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కి కామన్ సింబల్ ఉంటుందన్న నమ్మకం లేదు. అందుకే బీజేపీ తో పొత్తుకు పవన్ పాకులాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీస ఓట్లు రాకపోతే జనసేన పార్టీ శాశ్వత గల్లంతు అవుతుంది గుర్తింపు లేకుండా. బహుశా ఆ విషయాన్ని వీర మరణం కోణంలో సినిమాటిక్ గా పవన్ ఆయన సైనికులకు అందించారు. అయితే,బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తి లేదు. గతంలో పొత్తు పెట్టుకుని పలుమార్లు మోసపోయామని, ఈ సారి ఆ పరిస్తితి రానివ్వమని బీజేపీ నేతలు అంటున్నారు. అటు బీజేపీ అధిష్టానం సైతం టీడీపీతో పొత్తుకు రెడీగా ఉన్నట్లు కనబడటం లేదు.

Also Read: Ro Khanna Profile: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రో ఖన్నా..?

అదే సమయంలో ఏపీలో ఒక శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు వల్ల ప్రయోజనం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పైగా రాష్ట్రాన్ని ఆదుకోని బీజేపీతో పొత్తు టీడీపీకే నష్టమని అంటున్నారు. కాకపోతే కేంద్రం సపోర్ట్ ఉంటుందనే వాదన కూడా వస్తుంది. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు లాంటి వారు టీడీపీ-జనసేనలతో బీజేపీ కలుస్తుందని అంటున్నారు. కానీ ఇటు బీజేపీ నుంచి ఆ సిగ్నల్స్ లేవు. అటు టీడీపీ వాళ్ళు కూడా జనసేన చాలు బీజేపీ వద్దని అంటున్నారు. పైగా మూడు పార్టీలు కలిస్తే, అన్నీ కలిసి తమపై కుట్రలు చేస్తున్నాయని, జగన్ ఒంటరిగా పోరుకు దిగుతారని వైసీపీ శ్రేణులు సెంటిమెంట్ లేపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బీజేపీ కలవడంపై ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది.

టీడీపీ-జనసేన పొత్తు ఉంటే అధికార వైసీపీకి కాస్త రిస్క్ పెరుగుతుందని ఆ రెండు పార్టీలు వేసే అంచనా. కానీ బీ ఆర్ యెస్ రూపంలో పెద్ద గండి జనసేనకు పడనుంది. ఆ పార్టీతో పొత్తుకు వెళితే టీడీపీ కి కూడా నష్టం ఖాయంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉందనేది పక్కన పెడితే, ముందు టీడీపీ-జనసేనతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. జనసేన ఏమో టీడీపీతో పొత్తుకు రెడీ అవుతుంది. కాకపోతే పవన్…బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిసి ముందుకెళ్లెలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో పొత్తులు దిశగా ప్రతిపక్ష పార్టీలు ముందుకెళుతున్నాయి. దాదాపు టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయిందనే చెప్పవచ్చు. ఇటీవలే చంద్రబాబు-పవన్ రెండు సార్లు కలిశారు..ఇక తాజాగా శ్రీకాకుళం సభలో ఒంటరిగా వెళ్ళి వీర మరణం పొందడం కంటే..వ్యూహం ప్రకారం పొత్తులో వెళ్ళడం బెటర్ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇటు పవన్‌ మాటలని బాబు సమర్ధించారు. దీంతో రెండు పార్టీల పొత్తు ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. అంటే, వీరమరణం నుంచి బయట పడినట్టు పవన్ భావిస్తున్నారు. కానీ, బీజేపీ మద్దతు లేకపోతే గ్లాసు గల్లంతు కావటం ఖాయంగా కనిపిస్తున్న వేళా ఎన్నికల ముందే వీరమరణాన్ని జనసేన చవిచూడాల్సి వస్తుంది.