Janasena MP Candidates : జనసేన ఎంపీ అభ్యర్థులు వీరేనా..?

  • Written By:
  • Publish Date - February 25, 2024 / 09:08 PM IST

ఏపీ(AP)లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనసేన (Janasena) పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు సంబదించిన సీట్లను శనివారం ప్రకటించింది. ప్రస్తుతానికైతే 24 అసెంబ్లీ స్థానాలలో , 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ మరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. కేవలం 24 స్థానాల్లో పోటీ చేయడం ఫై జనసేన శ్రేణులతో పాటు కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో పవన్ ఆ మేరకు ఆలోచన చేస్తున్నారు.

ఇదిలా ఉంటె పవన్ ప్రకటించిన మూడు పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఓ వార్త బయటకు వచ్చింది. అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు (Naga Babu), మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasouri), కాకినాడ నుంచి సానా సతీశ్ (Sana Satish) పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఏదైనా అనూహ్య మార్పులు ఉంటే కాకినాడలో మరో అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉంటే జనసేన కాకినాడను వదులుకుంటుందని టాక్.

We’re now on WhatsApp. Click to Join.

ఇక టీడిపి పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు దక్కగా 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ దాదాపు ఖాయమైంది. రాజోలు, రాజమండ్రి రూరల్, పిఠాపురం, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాలకొండ, పెందుర్తి, యలమంచలి, విశాఖ దక్షిణం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, దర్శి, తిరుపతి, మదనపల్లి, గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇక జనసేన – టీడీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇరు పార్టీల్లో నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు చేయడం చేస్తున్నారు. పెడన, రాజమండ్రి రూరల్ జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. పొత్తులో భాగంగా ఈ సీట్లను టీడీపీకి కేటాయించారు. టీడీపీకి అమ్ముడుపోయారంటూ కృష్ణా (D) జనసేన అధ్యక్షుడు రామకృష్ణ దిష్టిబొమ్మను పెడన నేతలు దగ్ధం చేశారు. క్యాడర్ ను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహించారు. ఇటు రాజమండ్రి (R) సీటుని TDP నేత గోరంట్లకు ఇస్తుండటంతో కందుల దుర్గేశ్ అనుచరులు ఫైర్ అయ్యారు. జనసేన స్టిక్కర్లను తొలగిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Read Also : Tyre Punctures: కార్ల టైర్లు ఎన్ని పంక్చర్ల తర్వాత మార్చాలి.. ట్యూబ్,ట్యూబ్‌లెస్ టైర్ల మధ్య ఇదే?