Janasena Mega plan :`సుఫారీ` సుడులు! ప‌వ‌న్ `హ‌త్య‌కు కుట్ర నిజ‌మా?

Janasena Mega plan: రాజ‌కీయాల్లో `సుఫారీ` అనే ప‌దం కీల‌కంగా మారింది. సానుభూతి కోసం వాడే ప‌దంగా మారిపోయింది.

  • Written By:
  • Updated On - June 19, 2023 / 03:29 PM IST

Janasena Mega plan: రాజ‌కీయాల్లో `సుఫారీ` అనే ప‌దం కీల‌కంగా మారింది. సానుభూతి కోసం వాడే ప‌దంగా మారిపోయింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌ర‌కు ఆ అస్త్రాన్ని వ‌ద‌ల్లేదు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే `మెగా` కుటుంబాన్ని మ‌ట్టు పెట్టాల‌ని కుట్ర జ‌రిగింద‌ని తాజాగా ప‌వ‌న్ చెప్పే మాట‌. అంతేకాదు, వారాహి యాత్ర సంద‌ర్భంగా హ‌త్య చేయ‌డానికి కుట్ర ప‌న్నార‌ని ప‌వ‌న్ అభిమానుల్లో రేకెత్తిన అనుమానం. దానికి సినిమాటిక్ కోణాల‌ను అద్దారు. భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టేలా ప్ర‌య‌త్నం చేస్తూ వాటి నుంచి సానుభూతి పొందాల‌ను చూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

`మెగా` కుటుంబాన్ని మ‌ట్టు పెట్టాల‌ని కుట్ర జ‌రిగింద‌ని తాజాగా ప‌వ‌న్ (Janasena mega plan)

ఆ మ‌ధ్య గుజరాత్ , పంజాబ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హ‌త్య చేయ‌డానికి పాకిస్తాన్ తో సుఫారీ కుదుర్చుకున్నార‌ని కాంగ్రెస్ మీద మోడీ చేసిన ఆరోప‌ణ‌. దాని నుంచి ఓట్ల‌ను దండుకోవాల‌ని ఆయ‌న వేసిన ఎత్తుగ‌డ‌. కానీ, ప్ర‌ధాన మంత్రి స్థాయి లీడ‌ర్ ఆ కామెంట్ చేశారంటే, నిజముందేమోన‌ని చాలా మంది న‌మ్మారు. పాకిస్తాన్ అంటే పూన‌కం వ‌చ్చే భార‌తీయుల ఓట్లను ఆ విధంగా పొందాల‌ని బీజేపీ వేసిన ఎత్తుగ‌డగా అప్ప‌ట్లో కాంగ్రెస్ వివ‌రించింది. కానీ, మోడీ వేసిన ఎత్తుగ‌డ పారింది. ఆ త‌రువాత సుఫారీ మీద ఎలాంటి విచార‌ణ లేదు. ఇక ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు హ‌త్య కు కుట్ర జ‌రుగుతుంద‌ని టీడీపీ అనుమాన ప‌డింది. ఆ మేర‌కు మీడియా ముందుకొచ్చి హ‌త్య‌కు కుట్ర అంశాన్ని హైలెట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌లితంగా ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..ప్రోగ్రామ్ సూప‌ర్ హిట్ అయింది.

ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ హ‌త్య‌కు కుట్ర

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని హ‌త్య చేయ‌డానికి కుట్ర జ‌రుగుతుంద‌ని వీలున్న‌ప్పుడ‌ల్లా సుఫారీ ప‌దాన్ని వాడారు. దాన్ని కోడి క‌త్తి సంఘ‌ట‌న‌తో ర‌క్తిక‌ట్టించారు. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనూహ్య ఫ‌లితాల‌ను సాధించారు. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ హ‌త్య‌కు కుట్ర అంటూ ఎన్నోసార్లు ఆరోప‌ణ‌ల‌ను విన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే, హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని, సుపారీ కుదుర్చుకున్నార‌ని రాజ‌కీయ నాయ‌కుల నుంచి త‌ర‌చూ వినిపిస్తోంది. ఇప్పుడు ప‌వ‌న్ నోట రావ‌డంతో మ‌రింత ప్రాచుర్యం పొందింది.

Also Read : Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?

రాజ‌కీయాల్లోకి రాక‌ముందే `మెగా` కుటుంబాన్ని మ‌ట్టుపెట్టాల‌ని ఎవ‌రో ప్ర‌య‌త్నం చేశార‌ని ప‌వ‌న్ చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీ, బీజేపీతో స‌ఖ్య‌తగా ఉన్నారు. అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సార‌థ్యం వ‌హించిన వైఎస్ టార్గెట్ చేశారా? అనే అనుమానం క‌లుగుతోంది. ఎందుకంటే, చిరంజీవి రాజ‌కీయాల్లోకి 2009 ఎన్నిక‌ల్లో ఎంట్రీ ఇచ్చారు. అంటే, 2009 కంటే ముందుగా `మెగా` కుటుంబాన్ని మ‌ట్టు పెట్టాల‌ని ప్లాన్ జ‌రిగి ఉండాలి. ఆ సాహ‌సం ఎవ‌రు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది ప‌వ‌న్ స్వ‌యంగా చెబితే బాగుండేది.

యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌వ‌న్

మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 2009 ఎన్నిక‌ల‌కు ముందుగా పెట్టారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మెగా హీరోలు అంద‌రూ పాల్గొన్నారు. స్వేచ్ఛ‌గా ప్రచారం చేశారు. యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ ఇప్ప‌టి కంటే ఎక్కువ‌గా ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు వాడారు. పంచ‌లూడ‌దీసి కొడ‌తానంటూ ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ మీద నోరుపారేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయ దాడి చేశారు మిన‌హా ఎక్క‌డా వ్య‌క్తిగ‌త దాడి జ‌ర‌గ‌లేదు. సినిమా గ్లామర్ తో సీఎం కావాల‌ని 2009 ఎన్నిక‌ల్లో మెగా హీరోలు యోచించారు. ఆ ఎన్నిక‌ల్లో 18 మంది ఎమ్మెల్యేల‌ను గెలిచిన పీ ఆర్పీ అన‌తికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. అందుకు వచ్చిన ఫ‌లాల‌ను ప‌వ‌ర్ ఫుల్ గా మెగా కుటుంబం అనుభ‌వించింది. ఎక్క‌డా ఆ కుటుంబాన్ని మ‌ట్టుబెట్టే ప్ర‌య‌త్నం రాజ‌కీయ ఎపిసోడ్ లో జ‌ర‌గలేదు.

రాజ‌కీయ జోక‌ర్  ప‌వ‌న్అంటూ విమ‌ర్శ‌ల‌కు దారితీసింది (Janasena Mega plan)

రాజ‌కీయ రుచిమ‌రిగిన యువ‌రాజ్యం అధ్య‌క్షుడు ప‌వ‌న్ 2014 ఎన్నిక‌లకు ముందుగా ప్ర‌జారాజ్యం త‌ర‌హాలో జ‌న‌సేన పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి 2018 వ‌ర‌కు ఎక్క‌డా ప‌వ‌న్ ప్ర‌జాక్షేత్రంలో క‌నిపించ‌లేద‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీతో క‌లిసి పోటీకి దిగారు. రెండో చోట్ల ఆయ‌న ఓడిపోవ‌డంతో పాటు డిపాజిట్ల‌కు ఆ పార్టీ అభ్య‌ర్థులు పరిమితం అయ్యారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ వాల‌కం న‌చ్చ‌క‌పోవ‌డంతో వైసీపీ పంచ‌న ఉన్నారు. గ‌త మూడేళ్లుగా ఆయన చేసిన పోరాటాలు పెద్ద‌గా లేవు. సినిమా షూటింగ్ ల్లో బిజీగా గ‌డిపారు. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న త‌రుణంలో విడ‌త‌ల‌వారీ ప్ర‌చారం అంటూ ఒక వాహ‌నాన్ని ప్ర‌త్యేకంగా త‌యారు చేసి సినిమా టిక్ ప్ర‌చారం (Janasena Mega plan )మొద‌లు పెట్టారు. కానీ, ఊహించిన విధంగా ఆయ‌న మూడు స‌భ‌ల్లో మూడు రకాలుగా ప్ర‌సంగించారు. దీంతో మ‌రోసారి రాజ‌కీయ జోక‌ర్ అంటూ విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.

Also Read : Pawan CM slogan : ప‌వ‌న్ సీఎం లెక్క‌తో ఏపీ రాజ‌కీయాల్లో తిక్క.!

హ‌ఠాత్తుగా ప‌వ‌న్ హ‌త్య‌కు కుట్ర అంటూ ప‌వ‌న్ వారాహి యాత్ర కు జోడించారు. దాన్ని చిలువ‌లు ప‌లువ‌లు చేస్తూ మెగా కుటుంబాన్ని ఎప్పుడో మ‌ట్టుపెట్టాల‌ని అనుకున్నార‌ని జ‌న‌సేనాని చెప్ప‌డం రాజ‌కీయ దిగ‌జారుడుకు నిద‌ర్శ‌నం. అస‌లే, ఆయ‌న అభిమానులు అదో ర‌కం. దానికి త‌గ్గట్టు హ‌త్య‌కు కుట్ర అంటే ఊరుకుంటారా? ఆ రేంజ్ లో దాన్ని హైలెట్ చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ వేడిని ర‌గిలించింది. హీరో రామ్ చ‌ర‌ణ్ రంగంలోకి దిగి బాబాయ్ ప‌వ‌న్ కు ర‌క్ష‌ణ గా ప్ర‌త్యేక ప్రైవేటు ద‌ళాన్ని పంపించార‌ని టాక్‌. సినిమా షూటింగ్ ల్లోనూ ప‌వ‌న్ కు మూడంచెల ర‌క్ష‌ణ ఉండేద‌ని చెబుతున్నారు. ఇప్పుడు వారాహి యాత్ర సంద‌ర్భంగా భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు. దీంతో ప్ర‌జల్ని ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ఆక‌ట్టుకున్నారు. సానుభూతి ప‌వ‌నాల కోసం చూస్తున్న‌ప్ప‌టికీ గ‌త కొన్నేళ్లుగా ఆప‌రేష‌న్ గ‌రుడ లాంటి మాట‌లు, సుఫారీ ఆరోప‌ణ‌లు వింటూ ఓట‌ర్ల కూడా విసుగెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప‌వ‌న్ వేసిన ఎత్త‌గ‌డ ఎంత వ‌ర‌కు ఓట్ల‌ను రాల్చుతుందో చూడాలి.

Also Read : Janasena : ఉస్తాద్ పై బీజేపీ `లీనం`