TDP – JSP : నారా బ్రాహ్మణితో జనసేన నేతల భేటి.. తాజా ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌రువాత ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. జ‌న‌సేన

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 01:20 PM IST

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌రువాత ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుతో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌లో ములాఖాత్ వెళ్లి బ‌య‌ట‌కు రాగానే పొత్తుల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీ జ‌న‌సేన పొత్తు ఎప్ప‌టి నుంచో చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల రెండు నెల‌ల ముందు ప్ర‌క‌టించాల‌ని భావించారు. కానీ చంద్ర‌బాబు అరెస్ట్‌తో ఆరు నెల‌ల ముందుగానే పొత్తుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. దీంతో టీడీపీ జ‌న‌సేన శ్రేణుల్లో ఫుల్ జోష్ మొద‌లైంది. రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తేనే ఓట్లు చీల‌వ‌ని ఇరు పార్టీ క్యాడ‌ర్ భావిస్తుంది. పొత్తుతో ఈ సారి జ‌గ‌న్‌ని ఓడించ‌డం ఖాయ‌మ‌ని జ‌న‌సైన‌,టీడీపీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

తాజాగా ఏపీలో జ‌ర‌గుతున్న ప‌రిణామాలు, రాజకీయ ప‌రిస్థితుల‌పై జ‌న‌సేన‌, టీడీపీలు ఉమ్మ‌డిగా కార్య‌చ‌ర‌ణ రూపొందించేందుకు సిద్ధ‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు జైల్లో ఉన్నా.. నారా లోకేష్ పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు. న్యాయ‌స‌ల‌హాల కోసం ఆయ‌న ప్ర‌స్తుతం ఢీల్లీలో ఉన్నారు. ఇటు రాజ‌మండ్రిలో భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిలు బ‌స చేస్తున్నారు. వివిధ పార్టీల నాయ‌కులు, టీడీపీ ముఖ్య నేత‌లు వీరిద్ద‌రిని క‌లిసి సంఘీభావం తెలుపుతున్నారు. లోకేష్ కూడా అరెస్ట్ అయితే పార్టీని బ్రాహ్మ‌ణి ముందుకు న‌డిపిస్తుంద‌ని ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు తెలిపారు. దీంతో భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన నేత‌లు కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిధర్, చంద్రశేఖర్ క‌లిశారు. వైసీపీ ప్ర‌భుత్వంపై త‌మ‌తో క‌లిసి పోరాటం చేస్తామ‌ని జ‌న‌సేన నేతుల బ్రాహ్మ‌ణి తెలిపారు.