Site icon HashtagU Telugu

AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత

Sudheer Joins Ycp

Sudheer Joins Ycp

మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్ (Ram Sudheer) ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రామ్ సుధీర్ తన అనుచరులు, స్నేహితులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. యడ్లపల్లి రామ్ సుధీర్‌తో పాటు స్థానిక జనసేన నాయకులు యడ్లపల్లి లోకేష్‌, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్‌, తోట జగదీష్‌, ప్రసాద్‌లు జనసేన పార్టీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ నేతృత్వంలో ఈ చేరికలు జరగడం విశేషం.

Read Also : Nara Lokesh Yuvagalam : అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేష్