Janasena : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రులు నోరుపారేసుకోవ‌ద్దు.. మంత్రుల‌కు జ‌న‌సేన నేత హెచ్చరిక

వైసీపీ మంత్రుల పై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. జనసేన రాష్ట్రం బాగుపడాలని

Published By: HashtagU Telugu Desk
Pawan

Janasena

వైసీపీ మంత్రుల పై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. జనసేన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటుందని ఆయ‌న తెలిపారు. వైసీపీ మంత్రులకు వాళ్ల శాఖల పై అవగాహన లేదని..ముందు శాఖల గురించి తెలుసుకోండంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవరో రాసిన స్క్రిప్ట్‌ని వైసీపీ మంత్రులు చ‌దువుతున్నార‌ని.. సొంతం గా మాట్లాడే దైర్యం మంత్రులకు లేదన్నారు. జనసేన ప్రశ్నించిన సమస్యలకు వైసీపీ సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని.. మంత్రి అంబటి జాగ్రత్త ఖబడ్దార్ అంటూ హెచ్చ‌రించారు. రాజుపాలెం నుంచి తాడేపల్లి కి తిరగటమే మంత్రి అంబటి పని సరిపోతుందని.. తైతక్కల మంత్రి రోజా జాగ్రత్త , నాలిక కత్తిరిస్తామంటూ గాదె వెంక‌టేశ్వ‌ర‌రావు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం వుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. మంత్రి జోగి రమేష్ కు తన శాఖ ఏదో తెలియదని.. జోగి ర‌మేష్ గంజాయి తాగి మాట్లాడుతున్నారని వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోఎక్కడి నుంచైన పవన్ పోటీకి చేయడానికి సిద్దంగా ఉన్నార‌ని గాదె వెంకటేశ్వ‌ర‌రావు తెలిపారు.

  Last Updated: 17 Jul 2023, 08:31 AM IST