Janasena Jung Siren Song : దద్దరిల్లుతున్న ‘జనసేన జంగ్ సైరన్’ ..

'జనసేన జంగ్ సైరన్' అంటూ సాగే ఈ పాటను నల్గొండ గద్దర్ పాడగా.. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు

Published By: HashtagU Telugu Desk
Janasena New Song

Janasena New Song

ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇక జనసేన (Janasena) విషయానికి ఈ నెల 27 నుండి అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో సోషల్ మీడియా లో జనసేన ప్రచార సాంగ్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తాలూకా సాంగ్స్ వైరల్ అవుతుండగా..తాజాగా ‘జనసేన జంగ్ సైరన్’ (Janasena Jung Siren Song) పేరుతో విడుదలైన సాంగ్ జనసేన శ్రేణులలో కొత్త ఉత్సహం నింపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

‘జనసేన జంగ్ సైరన్’ అంటూ సాగే ఈ పాటను నల్గొండ గద్దర్ పాడగా.. ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ (Jani Master) ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినా జానీ..ఇప్పుడు జనసేన కోసం రంగంలోకి దిగారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరి తన బాధ్యతను నిర్వర్స్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనసేన ను గెలిపించడం కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోపక్క పిఠాపురం నుండి ఈసారి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండడం తో అక్కడ పండగ వాతావరణం మొదలైంది. ఎవర్ని పలకరించిన ఈసారి మా ఓటు పవన్ కళ్యాణ్ కే అని చెపుతూ లక్ష మెజార్టీ తో గెలిపించుకుంటామని అంటున్నారు. మరి చూడాలి ఏంజరుగుతుందో…

Read Also : MS Dhoni: ధోనీకి ఇదే చివ‌రి సీజ‌నా..? అందుకే కెప్టెన్సీ వ‌దిలేశాడా..?

  Last Updated: 21 Mar 2024, 05:59 PM IST