Janasena : `జ‌న‌సేనాని` క‌ళ్లు తెరిపించిన సోష‌ల్ మీడియా!

జ‌న సైనికులు పెడుతోన్న పోస్ట్ ల కార‌ణంగా పార్టీకి జ‌రుగుతోన్న న‌ష్టాన్ని ప‌వ‌న్ గ‌మ‌నించారు. సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ ను జ‌న‌సేనానికి త‌గిలిం

  • Written By:
  • Updated On - June 9, 2022 / 12:36 PM IST

జ‌న సైనికులు పెడుతోన్న పోస్ట్ ల కార‌ణంగా పార్టీకి జ‌రుగుతోన్న న‌ష్టాన్ని ప‌వ‌న్ గ‌మ‌నించారు. సోష‌ల్ మీడియా ఎఫెక్ట్ ను జ‌న‌సేనానికి త‌గిలింది. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగారు. ఆ మేర‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విధిస్తూ జ‌న‌సైనికుల‌కు ఒక ట్వీట్ చేశారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల మైండ్ గేమ్ ను గ‌మ‌నించాల‌ని సూచించారు. పోస్ట్ పెట్టిన వాళ్లు నిజ‌మా? కాదా? అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డంతో పాటు హుందాగా రియాక్ష‌న్ ఉండాల‌ని ఆదేశించారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌త కొన్నేళ్లుగా జ‌నసేన క్యాడ‌ర్ వాడుతోన్న భాష ఏవ‌గింపు కలుగుతోంది. ప‌లువురు ఆ భాష‌ను చూసి పార్టీ భవిష్య‌త్ ను అంచ‌నా వేసే ప‌రిస్థితికి వ‌చ్చారు. అత్యంత వ‌ల్గ‌ర్ లాగ్వేజిని వాడటం చూశాం. మిగిలిన పార్టీలు అందుకు భిన్నం కాక‌పోయిన‌ప్ప‌టికీ జ‌న‌సేనికులు పెట్టే పోస్టుల్లో ఉండే బూతులు ఉండ‌వు. ఆ విష‌యంలో జ‌న సైన్యంకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సామాన్యుల్లో ఉంది. సామాన్యులు ఎవ‌రూ విన‌కూడ‌ని బూతుల‌ను ప్ర‌త్య‌ర్థుల‌పై ఉప‌యోగించ‌డంలో జ‌నసేన మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. అందుకే, వాళ్లు టార్గెట్ చేసిన వాళ్ల‌కు సానుభూతి ల‌భిస్తోంది. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే భాష‌ను వాడ‌డం కార‌ణంగా జ‌న‌సేన పార్టీ మీద ఆ ప్రభావం ప‌డింది. అందుకే, నష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు ప‌వ‌న్ పూనుకున్నారు.

హుందాగా లేక‌పోతే జ‌న‌సేన భ‌విత‌వ్యం ఏమిటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది. చ‌ర్చా వేదిక‌ల్లోనూ కొంద‌రు ఆ పార్టీ లీడ‌ర్లు వాడే ప‌ద‌జాలం తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా సామాన్యుల‌కు అనిపిస్తోంది. ఆడ‌, మ‌గ తేడా లేకుండా దుర్భాష‌లాడిన సంద‌ర్భాలు అనేకం. శ్రీరెడ్డి, క‌త్తి మ‌హేష్ లాంటి వాళ్ల విష‌యంలో జ‌న‌సేన క్యాడ‌ర్ వాడిన భాష‌ను ఇప్ప‌టికీ నెటిజ‌న్లు మ‌రిపోలేక‌పోతున్నారు. ఇటీవ‌ల వైసీపీ లీడ‌ర్ల మీద వాడి ప‌ద‌జాలం కూడా ఆ పార్టీ హుందాత‌నాన్ని ప్ర‌శ్నించేలా ఉంది. అధికార వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి అంబ‌టి రాంబాబు తదిత‌రులు వాడుతోన్న భాష‌ను మించిన అస‌భ్య ప‌ద‌జాల‌న్ని అల‌వోక‌గా జ‌న‌సేన్యం వాడేస్తోంది.

 

పొత్తుల అంశాన్ని ప‌వ‌న్ తెర‌మీద‌కు తీసుకొచ్చిన త‌రువాత ప్ర‌త్య‌ర్థుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నేరుగా ప‌వ‌న్ వాల‌కాన్ని టార్గెట్ చేస్తూ అధికార‌ప‌క్షం దుమ్మెత్తిపోసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌, ప్యాకేజీ వ్య‌వ‌హారాల‌ను ఉటంకిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు. ప్ర‌తిగా జ‌న‌సేన క్యాడ‌ర్ కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఇత‌ర మంత్రుల‌ను బూతులు తిడుతూ పోస్ట్ ల‌తో సోష‌ల్ మీడియాను ముంచెత్తారు. దీంతో అధికార‌ప‌క్షానికి సానుభూతి వ‌స్తుంద‌ని జ‌న‌సేన అగ్ర‌నేత‌లు గ‌మ‌నించారు. చాలా కాలంగా పార్టీ పోస్టుల మీద సామాన్యులు అభ్యంత‌ర పెడుతున్నార‌ని తెలుసు. కానీ, ఈసారి మాత్రం ప‌వ‌న్ రంగంలోకి దిగారు. జ‌న సైన్యాన్ని నియంత్ర‌ణ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుపై ప‌వ‌న్ ఇచ్చిన మూడు ఆప్ష‌న్ల మీద సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ జ‌రిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమ‌, వ‌ర్ల రామ‌య్య త‌దిత‌రుల పేర్ల మీద ట్వీట్లు క‌నిపించాయి. అవి షేక్ అంటూ వాళ్ల ఫిర్యాదు చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ఇచ్చిన ఆప్ష‌న్ల మీద బీజేపీ, టీడీపీ రెండూ ఒకేసారి దూరం జ‌రిగిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ లు వైర‌ల్ అయ్యాయి. దీంతో ప‌వ‌న్ మ‌రోసారి ఒంట‌ర‌య్యాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదంతా పార్టీకి పెరుగుతోన్న క్రేజ్ ను త‌గ్గించ‌డానికి ప్ర‌త్య‌ర్థులు ఆడుతోన్న మైండ్ గేమ్ గా ప‌వ‌న్ భావించారు. అందుకే, ప్ర‌త్య‌ర్థుల మైండ్ గేమ్ లో ప‌డ‌కుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని క్యాడ‌ర్ ను అప్ర‌మ‌త్తం చేశారు. ఆయ‌న గ‌తంలోనూ ఇలాంటి జాగ్ర‌త్త‌ల‌ను చెప్పిన‌ప్ప‌టికీ జ‌న సైన్యం త‌మ‌దైన పంథాలో బూతుపురాణం సోష‌ల్ మీడియా పోస్ట్ ల్లో వినిపిస్తూనే ఉంది. ఈసారైన వాళ్లు సంయ‌మ‌నం పాటిస్తారా? లేదా త‌మ స‌హ‌జ శైలిని కాద‌న‌లేరా? అనేది చూడాలి.