Janasena : ప‌వ‌న్ CM కోసం హ‌రిరామ‌జోగయ్య `వెట‌ర‌న్` పాలిటిక్స్

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌ర‌చూ ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena)ను రాజ‌కీయంగా విమర్శిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 12:32 PM IST

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌ర‌చూ ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena)ను రాజ‌కీయంగా విమర్శిస్తున్నారు. ఆయ‌న దూకుడుగా వెళుతున్నారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా వైసీపీ నుంచి క‌నిపిస్తున్నారు. కాపు(Kapu) సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ గా ఎదుగుతూ ప‌వ‌న్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో మాజీ ఎంపీ, కాపు జాతి ఐకాన్ హ‌రిరామ‌జోగయ్య కు కోపం వ‌చ్చింది. జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద రాజ‌కీయ దూకుడును త‌గ్గించుకోవాల‌ని వార్నింగ్ ఇచ్చారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena)

కాపు(Kapu) సామాజిక‌వ‌ర్గానికి రాజ్యాధికారం కావాల‌ని చాలా కాలంగా కోరుకుంటున్నారు. అందుకోసం బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల‌ను కూడా రాజ‌కీయ ఈక్వేష‌న్లో ఏకం చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆ కులాల మ‌ధ్య అంత‌రం క్షేత్ర‌స్థాయిలో భారీగా ఉంటోంది. పైగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కావాల‌ని డిమాండ్ వ‌చ్చిన ప్ర‌తిసారీ శెట్టి బ‌లిజ‌, బ‌లిజ‌, తెలగ‌, ఒంటరి కులాలు కాపుల‌కు దూరంగా జ‌రుగుతుంటాయి. ఎందుకంటే, ఇప్ప‌టికే బీసీ రిజ‌ర్వేష‌న్ ను ఆ కులాలు అనుభ‌విస్తున్నాయి. బీసీ రిజ‌ర్వేష‌న్లు కాపుల‌కు ఇవ్వ‌డానికి ఏ మాత్రం అంగీక‌రించే ప‌రిస్థితి ఆ కులాల్లో లేదు. అంటే, కాపు సామాజిక‌వ‌ర్గం వేరు బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంటరి వేర్వేరు అనే కోణం బ‌లంగా క‌నిపిస్తోంది.

Also Read : TDP-Janasena : జ‌న‌సేన‌తో పొత్తు టీడీపీకి మూడందాల చేటు, 30 చోట్ల అల‌జ‌డి

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు కావాల‌ని, బీసీల్లో క‌ల‌పాల‌ని గ‌తంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మించారు. ఆనాడు ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్ర‌స్ ను త‌గుల‌బెట్టే వ‌ర‌కు ఆ ఉద్య‌మాన్ని తీసుకెళ్లారు. అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబునాయుడు మీద అప‌వాదును మోపుతూ కాపుల‌ను టీడీపీకి దూరం చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయ‌న హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ కాపు రిజ‌ర్వేష‌న్ గురించి ఉద్య‌మించ‌లేదు. అయితే, మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య మంచం మీద నుంచి న‌డ‌వ‌లేక‌పోయిన ప‌రిస్థితుల్లోనూ కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఇటీవ‌ల ఉద్య‌మాన్ని ప్ర‌క‌టించారు. సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ (Janasena)రావాల‌ని ఆయ‌న వాయిస్ వినిపించారు.

కాపు రిజ‌ర్వేష‌న్ కోసం హ‌రిరామ‌జోగయ్య

కాపు రిజ‌ర్వేష‌న్ కోసం హ‌రిరామ‌జోగయ్య బ‌య‌ట‌కి రావ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎంగా ఉండాల‌ని ఆయ‌న స్టేట్ మెంట్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి శెట్టి బ‌లిజ‌, బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల నాయ‌కులు వాయిస్ పెంచారు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌ల‌కు(Janasena) కూడా కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉంటున్నారని క్షేత్ర‌స్థాయి రాజ‌కీయ ప‌రిశీల‌కుల అభిప్రాయం. ఇలాంటి ప‌రిస్థితుల్లో మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ లాంటి వాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను రాజ‌కీయంగా డ్యామేజ్ చేయ‌డానికి రంగంలోకి దిగారు. ఆ జాబితాలో పేర్ని నాని కూడా ఉన్నారు. నెల‌కో,వారానికో , రెండు నెల‌ల‌కు ఒక‌సారో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏదో ఒక అంశం మీద కామెంట్ చేసిన ప్ర‌తిసారీ ఉత్త‌రాంధ్ర నుంచి అమ‌ర్నాథ్, కోస్తా ఆంధ్రా నుంచి పేర్ని నాని తెర మీద‌కు వ‌స్తున్నారు. వాళ్ల‌ను క‌ట్ట‌డీ చేయ‌డానికి జ‌న‌సేన పార్టీకి మ‌ద్ధ‌తుగా హ‌రిరామ‌జోగ‌య్య రావ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Janasena-BjP : పొత్తుపై విచిత్ర సంకేతాలు! జ‌న‌సేనకు `వీర‌మ‌ర‌ణ` గండం!

రాజ‌కీయాల్లో బ‌చ్చావంటూ అమ‌ర్నాథ్ ను కామెంట్ చేస్తూ హ‌రిరామ‌జోగ‌య్య లేఖ రాశారు. కాపు(Kapu) సామాజిక‌వ‌ర్గాన్ని చీల్చ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని మానుకోవాని హిత‌వు ప‌లికారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఏమిటో తెలిదంటూ హెచ్చ‌రించారు. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను విమ‌ర్శిస్తే, రాబోవు ఎన్నిక‌ల్లో అమ‌ర్నాథ్ ను కాపులు ఓడిస్తార‌నే వార్నింగ్ ప‌రోక్షంగా ఇచ్చారు. అంటే, జ‌న‌సేన వైపు నుంచి కాపు వెట‌ర‌న్ లీడ‌ర్లు తెర వెనుక రాజ్యాధికారం కోసం ఎలా పావులు క‌దుపుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.