Site icon HashtagU Telugu

Janasena For AP : మోడీతో ప‌వ‌న్ ఢీ, చంద్ర‌బాబుకు జై!

Janasena For AP

Pawan Kalyan's Janasena Problem, Bjp's Problem

Janasena For AP : తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లించింది. తాను అనుకున్న విధంగా జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ కూటమికి గుడ్ బై చెప్పారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో క‌లిసి న‌డిచేందుకు సిద్ద‌మైన‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు, బీజేపీతో పొత్తు కూడా క్వారిటీ ఇవ్వ‌డం ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాల‌కు రూట్ క్లియర్ అయింది. ఇక ఇప్పుడు ఏమి జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిక‌రం.

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు వ్యూహం (Janasena For AP) 

తాజా స‌ర్వేల ప్ర‌కారం తెలుగుదేశం, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు క‌లిసి వెళితే, ఏపీలో రాజ్యాధికారం ఆ కూటమికి ఖాయంగా క‌నిపిస్తోంది. అంతేకాదు, ఢిల్లీ పీఠంపై ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక హోదా సాధించ‌డానికి  (Janasena For AP) అవ‌కాశం ఉంది. అందుకే, ముందుచూపుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్డీయే కూట‌మికి గుడ్ బై చెప్పారు. ఫ‌లితంగా మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన వ్యూహం బెడిసి కొట్టింది. తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచే క్ర‌మంలో చంద్ర‌బాబును జైలుకు పంప‌డం మోడీకి చుట్టుకుంటోంది. రాజ‌కీయంగా ఆయ‌న మీద ద‌క్షిణ భార‌త‌దేశం వ్యాప్తంగా నెగిటివ్ సంకేతాలు వెళ్లాయి. కేంద్ర నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుకున్న మోడీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకున్నారని తెలుస్తోంది.

మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసిన వ్యూహం బెడిసి

ఏపీ వ్యాప్తంగా బీజేపీకి ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. ఆ విష‌యాన్ని తాజా స‌ర్వేల ద్వారా క‌మ‌ల‌నాథుల‌కు అర్థ‌మ‌యింది. ఇప్పుడు తెర‌చాటున మ‌ద్ధ‌తు ఇస్తోన్న వైసీపీతో క‌లిసి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ, క్రిస్టియ‌న్ ఓటు బ్యాంకు క‌లిగిన వైసీపీ స‌సేమిరా బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధంగా లేదు. ఫ‌లితంగా రెంటికీ చెడ్డ రేవ‌డిగా బీజేపీ ప‌రిస్థితి మారింది. ఒక వేళ టీడీపీ క‌లిసిరాక‌పోయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని బీజేపీ భావించింది. అప్పుడు వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసిన‌ట్టు స‌మాచారం. కానీ, జ‌న‌సేన రివ‌ర్స్  (Janasena For AP) అటాక్ బీజేపీకి ఇచ్చింది.

టీడీపీ, వామ‌ప‌క్షాల‌తో ప‌వ‌న్ సై

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవ‌స‌రమ‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి యువ‌ర‌క్తం అవ‌స‌ర‌మ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అందుకే, జ‌న‌సేన ద్వారా టీడీపీకి యువబ‌లం  (Janasena For AP) ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఫ‌లితంగా రాష్ట్రం అభివృద్ధి, ప్ర‌గ‌తి దిశ‌గా న‌డుస్తుంద‌ని ఆయ‌న విశ్వసిస్తున్నారు. అందుకే, తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన ప‌వ‌న్ కేవ‌లం టీడీపీ, వామ‌ప‌క్షాల‌తో మాత్ర‌మే పొత్తుకు సై అన్నారు. ఎన్డీయేతో క‌లిసి న‌డిచే ప్ర‌సక్తి లేద‌ని తేల్చేశారు. ఆ ప్ర‌క‌ట‌న వెనుక రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి చంద్ర‌బాబును జైలుకు పంప‌డం వెనుక ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల ప్ర‌మేయం ఉంద‌ని ప‌వ‌న్ న‌మ్ముతున్నార‌ని తెలుస్తోంది. అలాగే, బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేల సారాంశం రెండో కార‌ణంగా క‌నిపిస్తోంది.

Also Read : Telangana Janasena : తెలంగాణ లో 32 స్థానాల్లో జనసేన పోటీ..నియోజకవర్గాల లిస్ట్ ఇదే

ప‌దేళ్ల క్రితం జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్ తొలుత బీజేపీ, టీడీపీతో క‌లిసి 2014 ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. ఆ త‌రువాత వామ‌ప‌క్షాలు, బీఎస్పీల‌తో క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ, ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఎప్పుడు లేకుండా రాజ‌కీయాల‌ను న‌డిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా జ‌గ‌న్మొహ‌న్ రెడ్డిని అధికారం నుంచి దింప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. ఆ క్ర‌మంలో బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇక్క‌డ వ‌ర‌కు క్లారిటీగా రాజ‌కీయాల‌ను న‌డిపిన ప‌వ‌న్ తెలంగాణ‌లో 32 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిలిపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్ర‌క‌టించిన త‌రువాత ఈ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jagan Delhi Deals : వైసీపీ, టీడీపీ మ‌ధ్య `I.N.D.I.A` గేట్

తెలుగుదేశం పార్టీ తెలంగాణ‌లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేన 32 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం పొత్తు మీద ప్ర‌భావం చూప‌నుంది. ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు కేవ‌లం ఏపీ వ‌ర‌కేనా? లేక తెలంగాణ‌లోనూ ఉంటుందా? అనేది ఇప్పుడు సందిగ్ధం. సాధార‌ణంగా సంప్ర‌దింపులు జ‌రిపిన త‌రువాత అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తారు. కానీ, తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంప్ర‌దింపులు లేకుండా అభ్య‌ర్థుల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామం ఎలాంటి సంకేతాల‌ను ఇస్తుందోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.