Janasena fever : డిప్ర‌ష‌న్లో ప‌వ‌న్ ? సోష‌ల్ మీడియాలో YCP దుమారం!!

జ‌న‌సేనాని (Janasena fever) ప‌వ‌న్ డిప్ర‌ష‌న్లో ఉన్నారా?సినిమాల్లోనూ ఆయ‌న అయిపోయిన‌ట్టేనా?అగ్ర‌హీరోల గురించి స‌భ‌ల్లో మాట్లాడుతున్నారు?

  • Written By:
  • Updated On - June 28, 2023 / 01:12 PM IST

జ‌న‌సేనాని (Janasena fever) ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్ర‌ష‌న్లో ఉన్నారా? సినిమాల్లోనూ ఆయ‌న పని అయిపోయిన‌ట్టేనా? ఇటీవ‌ల ఆయ‌న ఎందుకు టాలీవుడ్ లోని అగ్ర‌హీరోల గురించి రాజ‌కీయ స‌భ‌ల్లో మాట్లాడుతున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అవుతున్నాయి. ఏకంగా ప‌వ‌న్ డిప్ర‌ష‌న్లోకి వెళ్లార‌ని నిర్థారిస్తూ పోస్టులు పెడుతున్నారు. దానికి కార‌ణం ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు తీసుకుంటోన్న రెమ్యూన‌రేష‌న్ అంటూ సోషల్ మీడియాలో ప‌లు ర‌కాల పోస్టులు పెడుతున్నారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్ర‌ష‌న్లో (Janasena fever) 

టాలీవుడ్ అగ్ర‌హీరోగా చాలా సంవ‌త్స‌రాల పాటు ప‌వ‌న్ ఉన్నారు. ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ సామాన్య నిర్మాత‌లు త‌ట్టుకోలేర‌ని టాక్ ఉండేది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల మాజీ మంత్రి పేర్ని నాని కూడా బ‌య‌ట పెట్టారు. ఆయ‌న సినిమా మొత్తానికి 100 కోట్లు ఖ‌ర్చుపెడితే, ప‌వ‌న్ కు ఇచ్చే రెమ్యూన‌రేష‌న్60నుంచి 70 కోట్లు ఉంటుంద‌ని చెప్ప‌కొచ్చారు. అందుకే, ప‌వ‌న్ సినిమాలు 90శాతం డిశాస్ట‌ర్ అంటూ విశ్లేష‌ణ చేశారు. ఇప్పుడు ప‌వ‌న్ తో సినిమాలు తీయ‌డానికి పెద్ద నిర్మాత‌లు ముందుకు రాలేక‌పోతున్నారు. ఒక వేళ ఆయ‌న‌తో సినిమా తీసిన‌ప్ప‌టికీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుద‌ల అవుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు. స‌వాల‌క్ష ఆంక్ష‌ల న‌డుమ ఆయ‌న సినిమా ఓప‌నింగ్స్ ఆశించిన స్థాయిలో  (Janasena fever) ఉండ‌వ‌ని టాలీవుడ్ టాక్‌.

ప‌వ‌న్ కుంగిపోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన ప‌వ‌న్ వెండితెర క‌ళ  (Janasena fever)  త‌గ్గిపోతుందని వైసీపీ చెబుతోంది. దానికి తోడుగా అగ్ర హీరోలుగా ఉన్న ప్ర‌భాస్, జూనియ‌ర్, మ‌హేష్ లు ఎప్పుడో పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. వాళ్ల‌తో సినిమా నిర్మాణం కోసం 500 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. అగ్ర హీరోలుగా ఉన్న ఆ ముగ్గురు ఒక్కొక్క‌రు 100కోట్ల రెమ్యున‌రేష‌న్ దాటి వెళ్లిపోయార‌ని టాలీవుడ్ లోని టాక్. అందుకే, ఆ హీరోల‌ను త‌ల‌చుకుంటూ ప‌వ‌న్ కుంగిపోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న పోస్ట్ లు. అంతేకాదు, మెగా కుటుంబంలోని రామ్ చ‌ర‌ణ్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియ‌ర్ తో పాన్ వ‌ర‌ల్డ్ హీరోగా మారారు. హీరోలు నాని, దేవ‌ర‌కొండ విజ‌య్ ,శ‌ర్వానంద్, నాగ‌చైత‌న్య త‌దిత‌రుల రెమ్యూన‌రేష‌న్ కూడా 50 కోట్ల‌కు వ‌ర‌కు ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంచుమించు ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ స్థాయికి సెకండ్ క్లాస్ హీరోలు కూడా వ‌స్తుండ‌డాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని వైసీపీ చేస్తోన్న విమ‌ర్శ.

సినిమా రంగంలోనూ ప‌వ‌న్ ప‌ని అయిపోయింద‌ని వైసీపీ చేస్తోన్న ప్ర‌చారం

సాధార‌ణంగా రాజ‌కీయ మీటింగ్ ల్లో ఇత‌ర హీరోల ప్ర‌స్తావ‌ర ఉండ‌దు. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తోన్న వారాహి బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తి వేదిక మీద ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కార‌ణంగా త‌న సినిమాల‌కు 30కోట్లకు పైగా న‌ష్టం వాటిల్లంద‌ని చెబుతున్నారు. వాస్త‌వంగా మిగిలిన హీరోల సినిమాల‌కు ఏ విధంగా ఆంక్ష‌లు ఉన్నాయో, ప‌వ‌న్ సినిమాకు కూడా ఏపీలో అలాగే ఉన్నాయి. కానీ, ఆ సినిమాలు ఫ‌ట్ కావ‌డంతో న‌ష్టం వాటింద‌ని పేర్ని నాని చెబుతున్నారు. సినిమాలు బాగుంటే ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని, దానికి రాజ‌కీయానికి  (Janasena fever) ముడిపెట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : Pawan Kalyan: ప‌వ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా? తూర్పు కాపుల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియాకు వెళ్లిపోయిన ప్ర‌భాస్ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి ఎదిగారు. త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హాలీవుడ్ స్థాయి గుర్తింపు పొందారు. ఇక మ‌హేష్ బాబు సినిమాలు ఎప్పుడో పాన్ ఇండియా స్థాయి వ‌సూళ్ల‌ను అందుకున్నాయి. వాళ్ల‌ను అందుకోవ‌డం ప‌వ‌న్ వ‌ల్ల కాదు. పైగా వ‌య‌సు మీద ప‌డింది. రాజ‌కీయంగానూ ఆయ‌న ఉన్నారు. రెండు రంగాల మీద ఒత్తిడితో ప‌నిచేయాల్సి వ‌స్తుంది. రాజ‌కీయాల ప్ర‌భావం ఆయ‌న సినిమాల మీద ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఉంది. ఫ‌లితంగా సినిమా రంగంలోనూ ప‌వ‌న్ ప‌ని అయిపోయింద‌ని వైసీపీ చేస్తోన్న ప్ర‌చారం .అందుకే, ఆయన డిప్ర‌ష‌న్లోకి వెళ్లార‌ని, ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు చేయ‌లేని స్థితిలో ఉన్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఆ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా దుమ్మెత్తి పోయ‌డం జ‌న సైన్యానికి ఏ మాత్రం రుచించ‌డంలేదు.

Also Read : Janasena Mega plan :`సుఫారీ` సుడులు! ప‌వ‌న్ `హ‌త్య‌కు కుట్ర నిజ‌మా?