Pawan Kalyan: విశాఖలో అక్రమాలన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే.. జనసేన నేతలపై కేసులు..!!

విశాఖఎయిర్ పోర్టు దాడి ఘటనలో అరెస్టు అయిన తొమ్మిది మంది జనసేన నేతలు విడుదలయ్యారు. వీరి విడుదలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

  • Written By:
  • Updated On - October 23, 2022 / 10:47 AM IST

విశాఖఎయిర్ పోర్టు దాడి ఘటనలో అరెస్టు అయిన తొమ్మిది మంది జనసేన నేతలు విడుదలయ్యారు. వీరి విడుదలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. విశాఖలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయన్న భయంతోనే జనసేన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన జనసేన నేతలు బెయిల్ పై విడుదల కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. వీరు జైల్లో ఉంటే వారి ఫ్యామిలీలు ఎంత ఆవేదనకు గురయ్యాయో అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖలో ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే జనసేన నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ప్రజావాణి కార్యక్రమం అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్ పోర్టులో దాడి డ్రామాలు ఆడారని ఆరోపించారు. ఈ ఘటనలో మహిళా కార్యకర్తలను కూడా ఇరికించారని…నిబంధనలకు విరుద్ధంగా వారిని అర్థరాత్రి అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేయాలని జనసేన లీగల్ సెల్ సభ్యులకు పవన్ సూచించారు.