Site icon HashtagU Telugu

Pawan Kalyan: ఇప్పటానికి పవన్…కూల్చివేసిన ఇంటికో లక్ష ఆర్థికసాయం..!!

Pawan

Pawan

ఏపీ రాజకీయాల్లో ఇప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోర్టు తీరుతో అధికారపార్టీ వైసీపీ, జనసేన మధ్య రగడ మొదలైంది. కోర్టును తప్పుదోవ పట్టించారన్న అభిప్రాయంతో ఇప్పటం పిటిషనర్లకు లక్ష రూపాయాల జరిమానా విధించింది కోర్టు. అధికారులు ముందుగానే నోటిసులు ఇచ్చారని చెప్పినా…ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవా పట్టించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించింది కోర్టు. ప్రస్తుతం సుప్రీంను ఆశ్రయించారు. అయితే తీర్పు సంగతి పక్కనపెడితే జనసేన తీరుపై అధికార పార్టీనేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కోర్టు తీర్పుతో పవన్ కల్యాణ్ డ్రామాలన్నీ భయటపడ్డాయని మండిపడుతున్నారు.

పగటి వేశాలు మానుకోని ఇప్పటికైనా…వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ పవన్ కు చురకలంటిస్తున్నారు. అయితే పవన్ మాత్రం ముందుగా చెప్పినట్లుగానే…ఇవాళ (ఆదివారం) ఇప్పటం పర్యటనకు బయలుదేరుతున్నారు. తాను ఇచ్చిన హామీ ప్రకారం భాదితులకు ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలో ఇళ్లను నష్టపోయిన బాధితులకు ఇంటికి లక్షరూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు పవన్ కల్యాణ్.

అయితే పవన్ పర్యటనను వైసీసీశ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వారిని ధీటుగా ఆందోళన చేయాలని జనసేన కార్యకర్తలు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ ఇప్పటంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

Exit mobile version