Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వం

Jagan And Pawan

Jagan And Pawan

రాష్ట్రంలోని రైతులు సంతోషంగా లేరని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల కష్టాలను పట్టించుకునే అధికారులు లేరని.. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి వస్తారని ఆయన మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్‌ పాల్గొన్నారు.

సత్తెనపల్లిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అని, అతనివన్నీ పనికిమాలిన మాటలే అని విమర్శించారు. అంబటి కాపు గుండెల్లో కుంపటి అని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని వారు ఇరిగేషన్ మంత్రా? అని ప్రశ్నించారు.

Also Read: YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!

నేను ఎప్పుడు మాట్లాడినా నన్ను తిట్టడానికి వైసీపీ గాడిదలు బయటకివస్తాయి. నన్ను పీకేస్తే మళ్లీ మొలుస్తా, తొక్కేస్తే మళ్లీ లేస్తా. వారానికి ఒక్కసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీని ఓడిస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు విడివిడిగా పోటీచేయడం వల్లే వైసీపీ గెలిచిందన్నారు. 2014 లాగే కూటమిలాగే ఉంటే వైసీపీ గెలిచేది కాదు. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను. ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ నాకు పట్టలేదు. ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటే నేను సీఎం అవుతా అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరింత రౌడీయిజం చేసేందుకు చూస్తోందని.. ఇప్పటికే పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రోడ్లపై వారాహిపైనే పర్యటిస్తానని.. దమ్ముంటే ఆపాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు పవన్‌.