Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ ‘ఉంగరం’ మహిమ!

Pawan

Pawan

సాధారణంగా సినిమా స్టార్స్ కు సెంటిమెంట్ ఎక్కువే. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సెంటిమెంట్స్ ను బలంగా నమ్మేవాళ్లే. పలానా చోట షూటింగ్ మొదలుపెడితే సినిమా హిట్ అనీ.. షూటింగ్ పూజ కార్యక్రమాలకు అటెండ్ కాకపోతే సినిమా సక్సెస్ అందుకోవచ్చనే.. సెంటిమెంట్స్ టాలీవుడ్ లో సహజం. కానీ రాజకీయాల్లో సెంటిమెంట్ ను నమ్మేవాళ్లు కొందరు మాత్రమే. అలాంటివాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన ఎన్నికల సమయంలో  తన ప్రచార రథానికి (వాహనం) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రచార రథాన్ని సెంటిమెంట్ భావించేవారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినీ నటుడు సైతం పవన్ కళ్యాణ్ సైతం సెంటిమెంట్ మాయలో పడిపోయారు.

ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను నిశితంగా పరిశీలిస్తే.. ఆయన చేతివేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు కనిపిస్తుంటాయి. ఆయన ఉంగరాలు పెట్టుకోవడం వెనుక పెద్ద కథే ఉందట. పవన్ ఉంగరాల గురించి ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.  ఆయన రెండు ఉంగరాలను ధరించగా ఆ ఉంగరాలలో ఒకటి పగడం కావడం విశేషం. రాజకీయంగా అనుకూల ఫలితాలు రావాలనే ఆలోచనతో పవన్ ఈ ఉంగరాలను ధరించినట్టు బోగట్టా. పవన్ కళ్యాణ్ కు ఇలాంటి విషయాలలో నమ్మకాలు ఎక్కువని ఆయన సన్నిహితులు సైతం చెబుతారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఓటుబ్యాంక్ లేని జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు అడుగులు వేస్తోంది. పొత్తులపై పవన్ కళ్యాన్ చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన క్యాడర్ ఉన్న చంద్రబాబు కూడా పవన్ మాయలో పడ్డారని, అందుకే పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే ఇదంతా పవన్ ఉంగురాల మహిమే అని అంటున్నారు జన సైనికులు.