Janasena : ఉస్తాద్ పై బీజేపీ `లీనం`

Janasena `విలీనం కోసం జాతీయ పార్టీ ఒత్తిడి చేస్తోంది..` అంటూ రెండేళ్ల క్రితం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (pawan kalyan) ఇచ్చిన సంకేతం.

  • Written By:
  • Publish Date - May 20, 2023 / 03:38 PM IST

Janasena `విలీనం కోసం జాతీయ పార్టీ ఒత్తిడి చేస్తోంది..` అంటూ రెండేళ్ల క్రితం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (pawan kalyan) ఇచ్చిన సంకేతం. ఆ రోజున ఆ వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపింది. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో అన్న విలీనం చేస్తే, జ‌న‌సేన పార్టీని త‌మ్ముడు బీజేపీలో విలీనం చేస్తార‌ని సోష‌ల్ మీడియా వేదికగా అప్ప‌ట్లో రేగిన దుమారం. దానిపై టీవీ ఛాన‌ళ్ల‌లోనూ పెద్ద ఎత్తున డిబేట్ లు జ‌రిగాయి. `చావ‌నైనా చ‌స్తానుగానీ, పార్టీని విలీనం చేయ‌ను..` అంటూ ప‌వ‌న్ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌డంతో చాలా వ‌ర‌కు ఆ ఎపిసోడ్ స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు తాజాగా గ్లాస్ గుర్తు గ‌ల్లంతు కావ‌డంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ గుర్తును కామ‌న్ సింబ‌ల్ గా చేయ‌డంపై ప‌లు ర‌కాలుగా చ‌ర్చ మొద‌లైయింది.

విలీనం  కోసం జాతీయ పార్టీ ఒత్తిడి చేస్తోంది..Janasena

జ‌న‌సేన పార్టీని(Janasena) పెట్టి ప‌దేళ్లు అవుతోంది. ఆనాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల్ని భ‌ర్తీ చేసేలా ఓట్లు సంపాదించుకోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో (2019) త‌ప్ప పూర్తి స్థాయి పోటీకి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ దిగ‌లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ పార్టీకి రిజిస్ట్రేష‌న్ ఉంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉనికి మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ క‌నిపించ‌డంలేదు. ఏపీలో మాత్రం ఉనికి కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అడ్ర‌స్ లేని పార్టీగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీకి ఎంత ఓటు శాతం ఉంది? అనేది శాస్ట్రీయంగా చెప్ప‌లేని దుస్థితి. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఆ కూట‌మికి ల‌భించిన ఓటు బ్యాంకు సుమారు 5శాతం. దానిలో జ‌నసేన ఓటు షేర్ ఎంత‌? అనేది ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇప్పుడు మాత్రం 7 నుంచి 10శాతం అంటూ ప‌వ‌న్ (pawan kalyan)చెబుతుంటే, 30శాతం ఉంద‌ని నాగ‌బాబు(Nagababu) చెబుతున్నారు. కానీ, వాళ్లు చెప్పేదానికి ఎక్క‌డా కొల‌మానం లేదు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  రిజిస్ట్రేష‌న్

జేగువీరా, చాక‌లి ఐల‌మ్మ‌తో మొద‌లు పెట్టి కాన్షీరాం, మాయావ‌తి మీదుగా మోడీ,షా వాదం వ‌ర‌కు జ‌న‌సేన పార్టీని(Janasena) ప‌దేళ్ల‌లో తిప్పేశారు. గ‌త ఎన్నిక‌ల త‌రువాత మోడీ, షా వాదాన్ని వినిపిస్తూ పార్టీని న‌డుపుతున్నారు. కానీ, ఏనాడూ బీజేపీ ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చిన దాఖ‌లాలు లేవు. పైగా కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించారు. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేన పార్టీని సంప్ర‌దించుకుండా అభ్య‌ర్థిని బీజేపీ ఖ‌రారు చేసింది. విధిలేని ప‌రిస్థితుల్లో బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌కు(Pawankalyan) ప్ర‌చారం చేశారు. సీన్ క‌ట్ చేస్తే ఆ రెండు పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌కు డిపాజిట్లు రాలేదు. ఆ త‌రువాత బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరంగా ఉంది. బీజేపీ మాత్రం అభ్య‌ర్థులను నిల‌ప‌డం ద్వారా జ‌న‌సేన‌తో సంబంధంలేద‌ని ప‌రోక్షంగా తేల్చేసింది. ఆ పార్టీలు రెండూ క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌లేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను టీడీపీ బ‌హిష్క‌రించింది. ఫ‌లితంగా కొన్ని చోట్ల జ‌న‌సేన అభ్య‌ర్థులను నిల‌బెట్ట‌డం ద్వారా గెలిచింది. ఆ బ‌లాన్ని చూపిస్తూ 10 నుంచి 30శాతం ఓటు బ్యాంకు అంటూ ప‌వ‌న్, నాగ‌బాబు తోచిన లెక్క‌లు చెబుతున్నారు.

క‌మ్యూనిస్ట్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంప్ర‌దింపుల్లో

బీజేపీతో విసిగిపోయిన ప‌వ‌న్(Pawankalyan) గ‌త కొన్ని నెల‌లుగా చంద్ర‌బాబు (Chandrababu)వాదం వైపు పూర్తిగా మ‌ళ్లారు. ఆయ‌న గ్రాఫ్ బాగా పెరిగింద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. 2014 త‌ర‌హాలో బ‌య‌ట నుంచి ప‌వ‌ర్ ఎంజాయ్ చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. సీఎం ప‌ద‌విని ఆశించ‌కుండా పొత్తుకు సై అంటూ ముందుకొచ్చారు. స‌రిగ్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చిన త‌రువాత బీజేపీ(Delhi BJP) అప్ర‌మ‌త్తం అయింది. జ‌న‌సేనాని మీద దృష్టి పెట్టింది. క‌మ్యూనిస్ట్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంప్ర‌దింపుల్లో ఉన్నార‌ని నిఘా వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుకుంద‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే, కాంగ్రెస్ పార్టీకి రాబోవు రోజుల్లో కేంద్రంలోనూ మ‌ద్ధ‌తు ఇచ్చేలా స్కెచ్ వేశార‌ని బోగ‌ట్టా. అందుకే, తొలి విడ‌త గ్లాస్ ను గ‌ల్లంతు చేస్తూ కామ‌న్ సింబల్ అయ్యేలా చేసింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?

రాబోవు రోజుల్లో ప‌వ‌న్ ను (Pawankalyan) వ‌దిలించుకోవ‌డానికి బీజేపీ సిద్ధ‌మైయింద‌ని తెలుస్తోంది. అందుకే, స‌హ‌జ మిత్రునిగా ఉన్న వైసీపీ ద్వారా పావులు క‌దుపుతుంద‌ని వినికిడి. ఆ క్ర‌మంలోనే గ‌త వారం నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) బాహాటంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద విరుచుకుప‌డుతున్నార‌ట‌. ఇక కామ‌న్ సింబ‌ల్ లేకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేస్తే ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌ను ఎలా భ‌ర్తీ చేస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. దీంతో రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం బీజేపీతో క‌లిసినా? దూరం జ‌రిగినా? త‌ప్ప‌ద‌న్న‌ట్టు ప‌వ‌న్ ప‌రిస్థితి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ పెద్ద‌ల‌ను క‌లుపుకుని వెళ్ల‌డం ప‌వ‌న్ కు అసాధ్యంగా క‌నిపిస్తోంది. రెండో కోణాన్ని బీజేపీ ప‌రిశీలిస్తుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. ఆ రెండో కోణం ఏమిటి? అని ప్ర‌శ్నించుకుంటే రెండేళ్ల‌ క్రితం ప‌వ‌న్ చెప్పిన దానిపై బీజేపీ `లీనం` అయింద‌ని తెలుస్తోంది.

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌