Janasena-BjP : పొత్తుపై విచిత్ర సంకేతాలు! జ‌న‌సేనకు `వీర‌మ‌ర‌ణ` గండం!

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ పొత్తు (Janasena-BJP) అంశంపై మాట్లాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - January 24, 2023 / 05:38 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎక్క‌డ‌కు వెళ్లిన‌ప్ప‌టికీ పొత్తు (Janasena-BJP) అంశంపై మాట్లాడుతున్నారు. ఆ విషయంపై గ‌త కొన్ని నెల‌లుగా జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌ల్లో నిలిచిపోతోంది. తాజాగా కొండ‌గ‌ట్టుకు వెళ్లిన ఆయ‌న యాత్ర‌కు వాడే `వారాహి` వాహ‌నం పూజ చేయించారు. ఆ సంద‌ర్భంగా బీజేపీతో పొత్తు(Alliance)లో ఉన్నామ‌ని తెలంగాణ గ‌డ్డ‌పై వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌తో పొత్తుకు వెళుతున్నామ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో ఏపీలోని భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రుగుతోన్న బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఆ పార్టీ చీప్ సోము వీర్రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం పొత్తుపై అనుమానాల‌ను రేకెత్తిస్తోంది.

ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా..(Janasena-BJP)

ఇంత‌కాలం తెలంగాణ‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. తెలంగాణ‌లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. బ‌హుశా అందుకే, బీజేపీతో పొత్తులో (Janasena-BJP) ఉన్నామ‌ని ఆయ‌న చెప్ప‌డం వ్యూహంలో భాగ‌మై ఉండొచ్చు. కానీ, ఏపీ రాజ‌కీయాల‌కు వ‌చ్చేట‌ప్ప‌టికీ మ‌రోలా ఆయ‌న ఆలోచ‌న ఉంది. అవ‌స‌ర‌మైతే, బీజేపీని వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. పార్టీని బ‌తికించుకోవ‌డానికి టీడీపీ ఆశ్ర‌యించాల్సిందేన‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఇప్ప‌టికే ప‌లుమార్లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ భేటీని (Alliance) చూశాం. వీలైయితే, బీజేపీని కూడా క‌లుపుకుని పోవాల‌ని ప‌వ‌న్ త‌ల‌పోస్తున్నారు. కానీ, కేంద్రం నుంచి. ఆయ‌న‌కు వ‌చ్చిన రోడ్ మ్యాప్ మ‌రోలా ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతుంది. అందుకు త‌గిన విధంగా భీమ‌వ‌రం కేంద్రంగా జ‌రుగుతోన్న బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశం వేదిక‌పై వీర్రాజు వ్యాఖ్య‌లు ఉన్నాయి.

Also Read : Janasena: వీరమరణం అంచుల్లో జనసేన.. బతికించే పవన్ తిక్కలెక్క!

ఏపీలో ఒంట‌రిగా వెళ్ల‌డానికి బీజేపీ సిద్ధ‌ప‌డుతుంద‌ని ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు సంకేతాలు ఇచ్చారు. అంటే, ప‌వ‌న్ బీజేపీని వీడుతున్నాడ‌ని ఆ పార్టీకి అర్థమ‌యింద‌న్న‌మాట‌. ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌లు కొంద‌రు టీడీపీతో పొత్తుకు సై అంటున్నారు. మ‌రికొంద‌రు నో అంటూ త‌ల‌తిప్పుకుంటున్నారు. దీంతో బీజేపీని వ‌దులుకోవ‌డానికి జ‌న‌సేన సిద్ధ‌ప‌డింద‌ని తెలుస్తోంది. అందుకే, బీజేపీతో పొత్తు అంటూనే ఎన్నిక‌ల‌కు రెండు వారాల ముందుగా క్లారిటీ ఇస్తానంటూ ప‌వ‌న్ తాజాగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానంటూ ప‌వ‌న్

గ‌త మూడేళ్లుగా బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఒకే వేదిక‌పై క‌నిపించిన సంద‌ర్భాలు బ‌హు అరుదు. అయిన‌ప్ప‌టికీ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు అంటూ వినిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు క‌లిసి తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డాన్ని చూశాం. అక్క‌డ బీజేపీ, జ‌నసేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ‌ను గెలిపించాల‌ని ప‌వ‌న్ ప్ర‌చారం చేశారు. సీన్ క‌ట్ చేస్తే, డిపాజిట్లు రాలేదు. దీంతో బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆనాటి నుంచి ప‌వ‌న్ ను లైట్ గా తీసుకున్నార‌ని స‌మాచారం. ఆ త‌రువాత జ‌రిగిన బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు ఎవ‌రుదారి వాళ్లు చూసుకున్నారు. ఇంత జ‌రిగిన‌ప్ప‌టికీ ఢిల్లీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం విచిత్రం.

తెలంగాణ‌లోనూ పోటీ చేయాల‌ని ప‌వ‌న్ కొత్త‌గా

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ వ‌చ్చిన సంద‌ర్భంగా ప‌వ‌న్ కు ఆహ్వానం ల‌భించింది. ఆ రోజు రోడ్ మ్యాప్ ఇస్తార‌ని జ‌న‌సేన ఆశ‌ప‌డింది. కానీ, అక్క‌డ ఏదో వార్నింగ్ టైప్ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. ఆ రోజు నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను పూర్వం మాదిరిగా విమ‌ర్శించ‌డానికి వెనుకాడుతున్నారు. చాలా వ‌ర‌కు దూకుడు త‌గ్గింది. అయితే, చంద్ర‌బాబును మాత్రం క‌లుస్తున్నారు. అంటే, బీజేపీని వ‌దిలేసి టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి సిద్ద‌ప‌డ్డారు. అందుకే, తెలంగాణ‌లోనూ పోటీ చేయాల‌ని ప‌వ‌న్ కొత్త‌గా ఆశ‌ప‌డుతున్నారు. రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం ద‌గ్గ‌ర నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పోటీకి ప‌వ‌న్ సిద్ద‌మ‌వ‌డానికి కార‌ణం టీడీపీ మీద ఆయ‌న‌కున్న చిగురాశ‌. ఆ పార్టీ మ‌ద్ద‌తుతో వీర‌మ‌ర‌ణం నుంచి జ‌న‌సేన పార్టీని ఈసారి ఎన్నిక‌ల్లో త‌ప్పించ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు పొత్తు కోసం ఒడ్డుతున్నారు. కానీ, బీజేపీ లీడ‌ర్లు మాత్రం ఆయ‌న‌కు కౌంట‌ర్ ఇచ్చే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఒక వేళ బీజేపీ, జ‌న‌సేన పొత్తు లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్లాస్ గుర్తు గ‌ల్లంతైన‌ట్టేన‌ని క‌మ‌లం పార్టీలోని టాక్‌.

Also Read : Pawan Kalyan: కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. జనం ప్రభంజనం!