Site icon HashtagU Telugu

Ambati Rambabu ఫై జనసేన సినిమా.. ‘SSS – సందులో సంబరాల శ్యాంబాబు’ టైటిల్

Satyameva Jayate Deeksha

Satyameva Jayate Deeksha

మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు , శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తిరుపతిలో వినూత్న నిరసనకు దిగారు. ఏపీలో రాజకీయాలు కాస్త సినీ రాజకీయాలుగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ లో పృద్వి క్యారెక్టర్ ఫై రాజకీయ రగడ రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. ఈ క్యారెక్టర్ ఫై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితం అంబ‌టి రాంబాబు  (Minister Ambati Rambabu) మాట్లాడుతూ.. బ్రో సినిమాలో త‌న‌పై ఒక క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేసి వెటకారం చేసారని మండిప‌డ్డారు. సోమవారం మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్రో (BRO) చిత్రం అట్టర్ ప్లాప్ అని , చంద్ర‌బాబు ముఠా అమెరికాలో డ‌బ్బు వ‌సూలు చేసి బ్రో సినిమా నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్‌ కి ఇస్తే… ఆ మొత్తాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో అందించారని మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేసారు. బ్రో సినిమాలో శ్యాంబాబు అని ఒక పాత్ర‌కు పేరు పెట్టి ప‌వ‌న్ కించ‌ప‌రిచి దూషించారు కాబ‌ట్టే ..ప‌వ‌న్‌పై మేము కూడా సినిమా తీయాల‌ని అనుకుంటున్నాం. ఈ క‌థ‌కు నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి-ఎగ‌తాళి, మూడు ముళ్లు -ఆరు పెళ్లిళ్లు తదిత‌ర పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయని ఎద్దేవా చేసారు.

మంత్రి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు , శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తిరుపతిలో వినూత్న నిరసనకు దిగారు. SSS పేరుతో మంత్రి అంబటి రాంబాబుపై సినిమాకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. SSS అంటే ‘సందులో సంబరాల శ్యాంబాబు’ అని వెల్లడించారు.

హీరోయిన్స్‌గా ఇద్దరిని ముంబయి రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొస్తామని ..రెడ్ లైట్ ఏరియా నుంచి రాక పోతే కలకత్తా.. చాందినీ గంజ్ నుంచి హీరోయిన్‌లను తీసుకొస్తామన్నారు. జగ్గూ బాయి సమర్పణలో సినిమాను రూపొందిస్తామన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి ఇంకోసారి మాట్లాడితే రాబోయే రోజుల్లో xxx రాంబాబు అనే సినిమా తీస్తామని హెచ్చరించారు.

అలాగే పోతిన మహేష్ మాట్లాడుతూ..జగన్ పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది.. కానీ బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను. దాని పేర్లు వచ్చేసి.. తల్లి, చెల్లి ఖైదీ నంబర్ 6093, – డాక్టర్ ఆఫ్ వివేక, గంజాయి మిస్ అయిన అమ్మాయి , మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అదే ఇల్లు, ఒక ఖైదీ వదిలిన బాణం. వైసీపీ లో ఉన్న నటులు కూడా ట్రై చేసుకోవచ్చుతెల్ల జుట్టు ఉందని ఏమీ పక్కన పెట్టం.. ఏ ఒక్క విషయం విస్మరించం. అన్నీ వాస్తవాలు వివరిస్తాం.. బయట డైరెక్టర్ ని పెట్టి వెబ్ సిరీస్ తీస్తాం’’ అని తెలిపారు. మొత్తం మీద బ్రో కాస్త అంబటి vs జనసేన గా మారింది.

Read Also : Hero Tarun: పెళ్లి వార్తలపై హీరో తరుణ్ క్లారిటీ!