Janasena : `వారాహి` క‌దిలేది అప్పుడే.! ఆర్భావ స‌భ‌లో జై చంద్ర‌న్న‌ రోడ్ మ్యాప్ ?

జ‌న‌సేనాని(Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపొందించుకున్న `వారాహి`(Varahi) రోడ్డు

  • Written By:
  • Updated On - March 2, 2023 / 03:35 PM IST

జ‌న‌సేనాని(Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపొందించుకున్న `వారాహి`(Varahi) రోడ్డు మీద‌కు రావ‌డానికి ముహూర్తం ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర‌లేదు. వాస్త‌వంగా జ‌న‌వ‌రి 26వ తేదీన బ‌స్సు యాత్రకు ప‌వ‌న్ బ‌య‌లుదేరాలి. కానీ, ఆయ‌న `వారాహి` పూజ‌లు చేసి షెడ్ లోకి తోసేశారు. ఇప్పుడు మ‌ళ్లీ దాన్ని మార్చి 14వ తేదీన బ‌య‌ట‌కు తీసుకొస్తార‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల్లోని టాక్. ఎందుకంటే, ఆ రోజు జ‌న‌సేన ఆవిర్భావ దినోత్సవం. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ ఏడాదిలోకి జ‌న‌సేన అడుగుపెడుతుంది. అందుకే, మ‌చిలీప‌ట్నం కేంద్రంగా జ‌రిగే ఆవిర్భావ స‌భ‌కు `వారాహి` మీద మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ నుంచి స‌భాస్థ‌లికి చేరుకోవడానికి బ‌య‌ట‌కు తీస్తారట‌. ఆ రోజు రాష్ట్ర వ్యాప్త ప‌ర్యట‌న మీద కూడా ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

మార్చి 14వ తేదీన మ‌చిలీప‌ట్నం కేంద్రంగా ఆవిర్భావ స‌భ‌..(Janasena)

తొమ్మిదో ఆవిర్భావ స‌భ వేదిక మీద నుంచి రోడ్ మ్యాప్ ను(Varahi) ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తార‌ని జ‌న‌సైనికులు ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆయ‌న ప్ర‌క‌టించే రాజ‌కీయ పొత్తుల‌కు అనుగుణంగా ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన పాత్ర ఏమిటి? అనేది తేల‌నుంది. ప్ర‌స్తుతానికి ఏపీ బీజేపీతో పొత్తు కొన‌సాగిస్తోంది. తెలంగాణ బీజేపీ ఎప్పుడో జ‌న‌సేన పార్టీని ప‌క్క‌న పెట్టేసింది. రాబోవు రోజుల్లో తెలంగాణాలోనూ పోటీ చేయాల‌ని భావిస్తోన్న జ‌న‌సేన(Janasena) రోడ్ మ్యాప్ విభిన్నంగా ఉంటుంద‌న్న సంకేతం వ‌స్తోంది. అంతేకాదు, పొత్తుల విష‌యంలోనూ బీజేపీతో కలిసి వెళ్లాలా? తెలుగుదేశం పార్టీతో క‌లిసి న‌డ‌వాలా? అనే దానిపై క్లారిటీకి రానుంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి)ని ఎదుర్కోవడానికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంపై స్టాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తు పెట్టుకునే అవకాశంపై స్టాండ్‌ను జ‌న‌సేనాని(Janasena) ప్రకటించే అవకాశం ఉంది. ఆవిర్భావ దినోత్సవాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భారీ నిర్వ‌హించ‌నున్నారు. క‌నీసం 4ల‌క్ష‌ల మందికి త‌గ్గ‌కుండా జ‌నం వ‌చ్చేలా స‌భ ఏర్పాట్లు ఇప్ప‌టి నుంచే చేస్తున్నారు. ఆ బ‌హిరంగ స‌భ ద్వారా పూర్తిగా జ‌న‌సేన భ‌విష్య‌త్ ఏమిటి? అనేది తేల‌నుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించే(Varahi) అవకాశం ఉంది.

Also Read : TDP-Janasena : జ‌న‌సేన‌లోకి రాధా ? `క్విడ్ ప్రో కో`చ‌ద‌రంగంలో వంగ‌వీటి, క‌న్నా.!

గత ఏడాది గుంటూరులో జరిగిన జేఎస్పీ(Janasena) ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో టీడీపీతో పొత్తుపై సంకేతాలు ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుకు బీజేపీ నో చెబితే, తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయవచ్చని లేదా కొత్త పొత్తులు పెట్టుకోవచ్చని జనవరి 24న పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ఎన్నికల పొత్తుపై స్పష్టత వస్తుందని కూడా ముక్తాయించారు. గత నెలరోజులుగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును రెండుసార్లు కలిసిన పవన్, ఓట్ల చీలికను నివారించాలని, అందుకే పార్టీలు ఏకతాటిపైకి రావాలని (Varahi)పిలుపునిచ్చారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపొందించుకున్న `వారాహి` రోడ్డు మీద‌కు..(Varahi)

ఇప్పటికే జ‌న‌సేన(Janasena) బీజేపీతో పొత్తు ఉంది. బీజేపీ నో చెబితే టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి ప‌వ‌న్ సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. కొత్త పొత్తులకు కూడా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గ‌త ఏడాది ఆవిర్భావ స‌భ ద్వారా నాలుగు ఆప్ష‌న్ల‌ను ఎంచుకున్న ప‌వ‌న్ ఈసారి ఒకే ఆప్ష‌న్ తీసుకుంటార‌ని జ‌న‌సైనికులు అంటున్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి త్యాగాల‌కు సిద్ధం కావాల‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ సంకేతాలు ఇచ్చారు. ఒంటిరిగా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌డం ఇష్టంలేద‌ని చెబుతూ పొత్తుల విష‌యాన్ని త‌న‌కు వ‌దిలేయాల‌ని క్యాడ‌ర్ కు ఇటీవ‌ల జ‌న‌సేనాని దిశానిర్దేశం చేశారు. మ‌రింత క్లారిటీ మార్చి 14న రానుంద‌ని జ‌న‌సేన క్యాడ‌ర్ (Varahi)ఎదురుచూస్తోంది.

Also Read : Janasena : షెడ్ కు ప‌రిమిత‌మైన ప‌వ‌న్ `వారాహి`! జ‌న‌సేనానిపై కేసీఆర్ షాడో!