Site icon HashtagU Telugu

Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం

Jana Small Finance Bank launched in AP

Jana Small Finance Bank launched in AP

Jana Small Finance Bank : భారతదేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్‌లో తమ తొలి శాఖను గుంటూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న కొత్త శాఖ డిపాజిట్లు, గృహ రుణాలు, బంగారు రుణాలు, సెక్యూర్డ్ మరియు అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, సరఫరా చైన్ ఫైనాన్స్ మరియు వ్యవసాయ రుణాలు వంటి విస్తృత శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది.

Read Also: Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ – డైరెక్టర్, శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ.. “అతి ముఖ్యమైన వాణిజ్య, వ్యవసాయ కేంద్రమైన గుంటూరులో మా మొదటి శాఖను ప్రారంభించటం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మా నెట్‌వర్క్‌ను విస్తరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. వ్యాపార సంస్థలు , వ్యక్తులకు అత్యుత్తమ ఆర్థిక సేవలను అందించడం ద్వారా రాష్ట్ర వృద్ధిలో పాల్గొనాలనే మా నిబద్ధత యొక్క ప్రారంభాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

ఈ ప్రారంభం గురించి తన ఆలోచనలను పంచుకున్న పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి మాట్లాడుతూ, “గుంటూరులో తమ మొదటి శాఖతో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్‌లో తమ తొలి అడుగు వేసిన ఈ మహోన్నత కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య మరియు వ్యవసాయ కేంద్రంగా, శక్తివంతమైన వ్యాపార సంస్థలు , వ్యాపారవేత్తలకు నిలయంగా గుంటూరు ఉంది, అందుబాటులో అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారు” అని అన్నారు. ఈ విస్తరణతో, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 25 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 796 శాఖలను నిర్వహిస్తుంది. వీటిలో 32.33% అన్‌బ్యాంక్డ్ రూరల్ సెంటర్ (URC) శాఖలు మరియు దాదాపు 25500 మంది ఉద్యోగులు సంస్థకు వున్నారు.

Read Also: Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత