Site icon HashtagU Telugu

AP : బీజేపీ కోసం సీట్లు త్యాగం చేసిన జనసేన..

Janasena Bjp

Janasena Bjp

జనసేన – టీడీపీ (Janasena- TDP) పార్టీలకు సంబదించిన అభ్యర్థుల తాలూకా ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ 94 , జనసేన 24 అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 57 సీట్లు బిజెపి కి కేటాయించినట్లు తెలుస్తుంది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజంగా 57 సీట్లు బిజెపి కి ఇస్తే గెలుస్తుందా..? 57 లో కనీసం 10 స్థానాలైన గెలిచే అవకాశం ఉందా..? అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. అదే 57 స్థానాలు జనసేన పార్టీ కి , 24 స్థానాలు బిజెపి ఇచ్చి ఉంటె బాగుండని, రాష్ట్రంలో బిజెపి కన్నా జనసేన గ్రాఫ్ బాగుంది..అలాంటప్పుడు జనసేన కు తక్కువ స్థానాలు కేటాయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా టిడిపి , బిజెపి తో జనసేన పొత్తు పెట్టుకొని నష్టపోతుందని జనసేన శ్రేణులు వాపోతున్నారు. మొన్నటి వరకు 60 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని భావించారు. కానీ కేవలం 24 సీట్ల తో సరిపెట్టుకుంది.

బీజేపీని దృష్టిలో పెట్టుకుని జనసేన సీట్లను తగ్గించుకున్నామని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘జనసేన కార్య కర్తలందరికీ చెబుతున్నా. టీడీపీతో కూటమి బలంగా ఉండాలంటే స్వప్రయోజనాలను పక్కన పెట్టాలి. మన ఓటు టీడీపీకి వెళ్లడం ఎంత ముఖ్యమో, టీడీపీ ఓటు మనకు రావడమూ అంతే ముఖ్యం. జగన్.. సిద్ధం సిద్ధం అని చావగొడుతున్నావు నీకు యుద్ధం ఇస్తాం. మేం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. గెలుస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ సిట్టింగ్ స్థానాలైన గుడివాడ, గన్నవరం నుంచి టీడీపీ నేతలు ఎవరు పోటీ చేస్తారా అని ఎదురుచూస్తుండగా.. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు బరిలో నిలిచారు. ఈ ఇద్దరిలో గన్నవరం లో వంశీ ఫై యార్లగడ్డ గెలుస్తారని అంత అంటున్నారు. గుడివాడ లో కూడా నాని ఫై పూర్తి వ్యతిరేకత ఉందని అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉందని చెపుతున్నారు. చూడాలి గెలుపు ఎవర్ని వరిస్తుందో..?

జనసేన అభ్యర్థులు వీరే

• తెనాలి: నాదెండ్ల మనోహర్

• నెల్లిమర్ల: లోకం మాధవి

• అనకాపల్లి: కొణతాల రామకృష్ణ

• రాజానగరం: బత్తుల బలరామ కృష్ణ

కాకినాడ రూరల్: పంతం నానాజీ

We’re now on WhatsApp. Click to Join.

 

టీడీపీ అభ్యర్థులు :

  1. ఆముదాలవసల – కూన రవికుమార్
  2. ఇచ్చాపురం – బెందాళం అశోక్
  3. టెక్కలి – అచ్చెన్నాయుడు
  4. రాజాం – కొండ్రు మురళీమోహన్
  5. అరకు – దొన్ను దొర
  6. కురుపాం – జగదీశ్వరి
  7. పార్వతీపురం – విజయ్ బొనెల
  8. సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
  9. బొబ్బిలి – బేబీ నాయన
  10. గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
  11. విజయనగరం – పూసపాటి అదితి
  12. నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
  13. పాయకరావుపేట – వంగలపూడి అనిత
  14. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
  15. విశాఖ వెస్ట్ – గణబాబు
  16. ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
  17. పి గన్నవరం – మహాసేన రాజేష్
  18. కొత్తపేట – బండారు సత్యానందరావు
  19. మండపేట – జోగేశ్వరరావు
  20. రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
  21. జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
  22. పెద్దాపురం – చినరాజప్ప
  23. తుని – యనమల దివ్య
  24. అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
  25. ఆచంట – పితాని సత్యనారాయణ
  26. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
  27. ఉండి – మంతెన రామరాజు
  28. తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
  29. చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
  30. తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
  31. నూజివీడు – కొలుసు పార్థసారథి
  32. ఏలూరు – బడేటి రాధాకృష్ణ
  33. గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
  34. గుడివాడ – వెనిగండ్ల రాము
  35. పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
  36. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
  37. పామర్రు – కుమార్ రాజా
  38. విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
  39. విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
  40. జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
  41. నూజివీడు – కొలుసు పార్థసారథి
  42. నందిగామ – తంగిరాల సౌమ్య
  43. తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
  44. మంగళగిరి – నారా లోకేష్
  45. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
  46. బాపట్ల – నరేంద్ర వర్మ
  47. ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
  48. చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
  49. సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
  50. వినుకొండ – జీవీ ఆంజనేయులు
  51. మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
  52. రేపల్లె – అనగాని సత్యప్రసాద్
  53. ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
  54. పర్చూరు – ఏలూరి సాంబశివరావు
  55. సంతనూతలపాడు – బీఎన్ విజయ్‌కుమార్
  56. అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
  57. ఒంగోలు – దామచర్ల జనార్థనరావు
  58. కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
  59. కొండెపి – డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
  60. కావలి – కావ్య కృష్ణారెడ్డి
  61. నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
  62. నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  63. గూడూరు – పాశం సునీల్ కుమార్
  64. సూళ్లూరు పేట – విజయ శ్రీ
  65. ఉదయగిరి – కాకర్ల సురేష్
  66. కడప – మాధవి రెడ్డి
  67. రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి
  68. పులివెందుల – బీటెక్ రవి
  69. మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
  70. ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియ రెడ్డి
  71. శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  72. కర్నూలు – టీజీ భరత్
  73. పాణ్యం – గౌరు చరితా రెడ్డి
  74. నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్
  75. బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి
  76. డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
  77. పత్తికొండ – కేఈ శ్యాంబాబు
  78. కొడుమూరు – దస్తగిరి
  79. రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు
  80. ఉరవకొండ – పయ్యావుల కేశవ్
  81. తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
  82. శింగనమల – బండారు శ్రావణి శ్రీ
  83. కళ్యాణ దుర్గం – అమిలినేని సురేంద్రబాబు
  84. రాప్తాడు – పరిటాల సునీత
  85. మడకశిర – సునీల్ కుమార్
  86. హిందూపురం – నందమూరి బాలకృష్ణ
  87. పెనుకొండ – సవితమ్మ
  88. తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
  89. పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
  90. నగరి – గాలి భాను ప్రకాష్
  91. గంగాధర నెల్లూరు – బీఎం థామస్
  92. చిత్తూరు – గురజాల జగన్‌మోహన్
  93. పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి
  94. కుప్పం – నారా చంద్రబాబునాయుడు