Jana Sena Symbol: జనసేన గ్లాస్ సింబల్ గోవిందా

కేంద్రం ఎన్నికల సంఘం జనసేనను గుర్తింపు లేని పార్టీగా తేల్చింది.

  • Written By:
  • Updated On - July 14, 2022 / 05:53 PM IST

కేంద్రం ఎన్నికల సంఘం జనసేనను గుర్తింపు లేని పార్టీగా తేల్చింది. ఆ పార్టీ సింబల్ గ్లాస్ ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను మాత్రమే ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది. కేవలం 8 పార్టీలను జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ తాజాగా కేంద్రం ఎన్నికల సంఘం గుర్తించింది. ఈసీ ప్ర‌కారం బీజేపీ, కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీఎస్పీ, సీసీఐ, సీపీఎం, ఎన్సీపీ, నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీలు మాత్ర‌మే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఇలా దేశంలోని 27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక ఈసీ గుర్తింపు కూడా లేని పార్టీలు 2,796 ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ త‌న అస్తిత్వం చాటుకుంటున్న జ‌న‌సేన‌ను గుర్తింపు లేని పార్టీల జాబితాలోనే ఈసీ ఉంచేసింది. అంతేకాకుండా ఏ పార్టీకి కేటాయించ‌ని 197 గుర్తుల‌ను ఫ్రీ సింబ‌ల్స్‌గా ప్ర‌క‌టించిన ఈసీ… అందులో జ‌న‌సేన గుర్తు గాజు గ్లాస్‌ను కూడా చేర్చింది.