Jana Sena Party : ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో సమన్వయంతో నామినేటెడ్ పోస్టులను కేటాయించే దిశగా కార్యాచరణను రెడీ చేస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు కూడా పలు నామినేటెడ్ పోస్టులను కేటాయించనున్నారు. కొన్ని నామినేటెడ్ పోస్టులను కేటాయించాలంటూ ఈ రెండు పార్టీలు ఇప్పటికే టీడీపీ(TDP) అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కోరారు. ప్రధానంగా జనసేన పార్టీ(Jana Sena Party) ఏయే నామినేటెడ్ పోస్టులను ఆశిస్తోంది ? వాటిని ఇచ్చేందుకు టీడీపీ రెడీ అవుతుందా ? అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ఆంధ్రప్రదేశ్‌లో 114 వరకు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో వివిధ సంస్థలు, కార్పొరేషన్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. కొన్ని కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులకు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా కూడా ఉంది. దీంతో అలాంటి పోస్టుల కోసం జనసేన, టీడీపీ, బీజేపీ పోటీపడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఏపీఎస్ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంటి సంస్థల ఛైర్మన్ పదవుల కోసం పోటీ నెలకొంది. వీటిలో ఏయే పోస్టులు ఏయే పార్టీకి దక్కుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Mrunal Thakur Watching her Favourite movie : మృణాల్ ఎక్కువగా చూసే సినిమా అదే అట..!
ఇటీవలే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో.. వాటిలో చెరొకటి టీడీపీ, జనసేన పంచుకున్నాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను కూడా అదేవిధంగా రెండుపార్టీలు విభజించి తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ పదవులు టీడీపీకే లభించనున్నాయి. నామినేటెడ్ పోస్టుల కోసం 25 మంది ఆశావహుల జాబితాను పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీఎం చంద్రబాబుకు అందజేశారు. సీఎం చంద్రబాబు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు పచ్చజెండా ఊపితే.. 25 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు జనసేన నేతలు ఛైర్మన్లు అవుతారు. ఇటీవల ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు దక్కని టీడీపీ నేతలకు పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవులను కేటాయించే అవకాశం ఉంది.ఈ పోస్టుల కేటాయింపులో సీనియర్లకు చంద్రబాబు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున సీట్లు ఆశించి భంగపడిన వారిలో ఆలపాటి రాజా (తెనాలి), బూరుగుపల్లి శేషారావు (నిడదవోలు), జలీల్ ఖాన్ (విజయవాడ పశ్చిమ), దేవినేని ఉమా (మైలవరం), ఎస్వీఎస్‌ఎన్ వర్మ (పిఠాపురం) వంటి నేతలు ఉన్నారు. వీరికి చంద్రబాబు తప్పకుండా నామినేటెడ్ పదవిని కేటాయించే అవకాశం ఉంది.