Site icon HashtagU Telugu

Nagababu : వైఎస్సార్ సీపీకి జనసేననేత నాగబాబు చురకలు..!!

Nagababu Pawan Kalyan

Nagababu Pawan Kalyan

వైస్సార్ సీపీ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నిర్వహించిన సభపై జనసేన నేత నాగబాబు ట్వీట్ చేశారు. వైజాగ్ ను రాజధాని చేయడం ఏంట్రా బాబు…వైజాగ్ ఆల్రేడీ రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకు రెండవ రాజధాని చేయమని గర్జించండి..అంటూ ట్వీట్ చేశారు. విశాఖో పవన్ పర్యటన నేపథ్యంలో నాగబాబు ఈ ట్వీట్ చేశారు.

కాగా ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనపార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను స్వీకరించనున్నారు. అక్కయపాలెం హైవే రోడ్డులోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. రేపు సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.